తేదీ … 27 – 04 – 2025, వారం … భానువాసరే ( ఆదివారం )

 

తేదీ … 27 – 04 – 2025,
వారం … భానువాసరే ( ఆదివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
వసంత ఋతువు,
చైత్ర మాసం,
బహుళ పక్షం,

తిథి : *అమావాస్య* రా1.22 వరకు,
నక్షత్రం : *అశ్విని* రా1.07 వరకు,
యోగం : *ప్రీతి* రా12.53 వరకు,
కరణం : *చతుష్పాత్* మ2.35 వరకు,
తదుపరి *నాగవం* రా1.22 వరకు,

వర్జ్యం : *రా9.23 – 10.53,*
దుర్ముహూర్తము : *సా4.32 – 5.22,*
అమృతకాలం : *సా6.24 – 7.54,*
రాహుకాలం : *సా4.30 – 6.00,*
యమగండం : *మ12.00 – 1.30,*
సూర్యరాశి : మేషం,
చంద్రరాశి : మేషం,
సూర్యోదయం : 5.40,
సూర్యాస్తమయం: 6.13,

*_నేటి విశేషం_*

*అమా భాను యోగం*
ఆదివారం నాడు అమావాస్య తిథి ఉన్నట్లయితే ఆ తిథి ని *అమా భాను యోగం* అని పిలుస్తారు.
జాతక చక్రం లోని రవి గ్రహ దోష నివారణ పూజలు చేసుకోవడానికి ఈ రోజు అత్యంత అనుకూలం.
మహా నదులలో, సముద్రాలలో పుణ్య స్నానాలు చేయడం విశేష ఫలితాలు కలుగుతాయి.

ఆదివారం చాలా విశేషమైన అత్యంత శుభ ఫలితాలు ప్రసాదించే రోజు,
నేడు కాలభైరవ స్వామి దర్శనం, కాళీ మాత పూజ, రుద్రాభిషేకములు చాలా ఫలితాలు అందిస్తాయి…

ఈ రోజున ఎవరయితే సూర్యునికి 3 దోసిట్లా నీరు చూపించి అర్ఘ్యం ఇస్తారో వారికి సూర్య భగవానుడు సంపూర్ణ ఆరోగ్యం,తేజస్సు,యశస్సు,విద్య,బుద్దిప్రకాశత్వం ప్రసాదించును…
సూర్యుని కి గోధుమ రవ్వ పంచదార కలిపిన ప్రసాదం నివేదన చేసిన ద్వాదశ అధిత్యులుని పూజించిన ఫలితం కలుగును.

ఈ రోజు చేయు పూజగాని, దానముగాని వెయ్యి సార్లు చేసిన ఫలితాలు కలుగునని శాస్త్ర వచనం.

అన్నం ఉదకం(నీరు), మజ్జిగ, గొడుగులు, చెప్పులు ( లేనివారికి మాత్రమే ) దానం చేసిన మూడు లోకాలు దర్శించిన పుణ్యం కలుగుతుందని శాస్త్ర వచనం.

ఈ రోజున అన్నదానం ఒకరికి చేసిన 1000ఆవులు దానం చేసిన ఫలితం

 

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*