
ఐఏఎస్ అరవింద్ కుమార్ పై తెలంగాణ హై కోర్టు సీరియస్..ఆదేశాలు పాటించకపోతే జైలుకెళ్లాల్సిందే…
మూసీ సుందరీకరణలో భూమి కోల్పోయిన వ్యక్తికి ప్రత్యామ్నాయ ప్లాటు కేటాయించడంలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ప్రభుత్వ అధికారులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను మూడు నెలల్లో అమలు చేయకపోతే రెండు వారాల జైలు శిక్ష తప్పదని అర్వింద్ కుమార్, ప్రసూనాంబలను హెచ్చరించింది. అంతేకాకుండా, జరిమానా కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. బాధితుడికి న్యాయం చేయాలనే ఉద్దేశం లేని అధికారుల తీరును కోర్టు తప్పుబట్టింది.
మూసీ సుందరీకరణలో ప్రభుత్వం సేకరించిన భూమికి బదులుగా మరో ప్లాటును ఇస్తామని హామీ ఇచ్చి.. దాన్ని ఉల్లంఘించిన అధికారులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలల్లో కోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే రెండు వారాలు జైలుకెళ్లాల్సి వస్తుందంటూ హైకోర్టు.. *ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, మరో అధికారిణి ప్రసూనాంబలను* హెచ్చరించింది. జైలు శిక్షతో పాటుగా జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
మూసీ సుందరీకరణలో భాగంగా సేకరించిన భూమికి ప్రత్యామ్నాయంగా 2016లో కేటాయించిన 666.67 చదరపు గజాల ప్లాటును యజమానికి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ మాట నిలబెట్టుకోలేదు. పైగా కోర్టు ప్రశ్నించిన ప్రతి సారి.. కోర్టు ధిక్కరణను తప్పించుకోవడం కోసం సదరు అధికారులు.. ప్లాటు అప్పగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తూ వస్తున్నారు తప్ప.. భూమిని కోల్పోయిన వ్యక్తికి న్యాయం చేయాలన్న ఉద్దేశం వారికి ఏమాత్రం లేదని ఈ సందర్బంగా తెలంగాణ కోర్టు అభిప్రాయపడింది. ఇకపై ఇలా కుదరదని కోర్టు స్పష్టం చేసింది. మూడు నెలల్లోపు ప్లాట్ రిజిస్ట్రేషన్ పూర్తి కాకపోతే దీనికి సంబంధించిన అధికారులు జైలుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది.
Be the first to comment