
విశాఖ డిప్యూటీ మేయర్ కుర్చీలాటిలో కాపులకు సముచిత స్థానం కల్పించాలని పలువురు కాపునేతలు, రాజకీయ విశ్లేషకులు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం కాపులకు విశాఖ డిప్యూటీ మేయర్ పదవి కేటాయించి కాపు సామాజిక వర్గం పట్ల తమ విధేయతను చాటుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలా కాకుండా ఇతర సామాజిక వర్గాలకు పట్టం కడితే కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని పలువురు నేతలు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం విశాఖ రాజకీయ రంగంలో కీలకంగా మారనుంది. అంతేకాకుండా విశాఖలో విలువలతో కూడిన రాజకీయం చేస్తూ, రాజకీయం అంటే కేవలం ఆదాయం మాత్రమే కాదని అభిమానం, ఆత్మీయతయని నిరూపిస్తూ నిరాడంబరతకు, భరోసాకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న నాయకులకు అవకాశం కల్పించాలని విశాఖ ప్రజలు సైతం కోరుకుంటున్నారు. ఆ కోవకు చెందిన వారిలో 43 వ వార్డు కార్పొరేటర్, మన కాపు బిడ్డ ఉషశ్రీ ముందంజలో ఉన్నారు. మన కుటుంబ సభ్యురాలైన ఉషశ్రీ మంచి విద్యవంతురాలు, సామాజ సేవలో తనదైన శైలిలో కార్పొరేటర్ గా ఎన్నో సేవలు అందిస్తూ ప్రజలు మనస్సులో చెరగని ముద్ర వేసుకుంటున్న రాజకీయ ఆశాకిరణం. జనసేన నుంచి మహిళా విభాగంలో ఉషశ్రీ గారికి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తే బాగుంటుందని నగర ప్రజలు, రాజకీయ విశ్లేషకులు, పలువురు నేతలు, కాపు సంఘాలు కోరుతున్నారు. ఉష శ్రీ గారికి డిప్యూటీ మేయర్ ఇస్తే కూటమి మరింత బలపడటమే కాకుండా భవిష్యత్తులో విశాఖ కూటమి ప్రభుత్వానికి రాజకీయ పరంగా అడ్డాగా మారుతోందని పలువురు కాపునేతలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Be the first to comment