
రిజర్వేషన్లపై KRPS స్పష్టమైన వైఖరి
‘‘ఎవరెంతో వారికంత’’, ‘‘మేమెంతో మాకంత’’ అనే సూత్రాలను అనుసరించి జనాభా ప్రాతిపదికగా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. సమధర్మాన్ని, సమన్యాయాన్ని పాలకపక్షాలు విధిగా పాటించాలి. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలలో సామాజిక న్యాయం వాస్తవరూపంలో ప్రాక్టికల్‌గా జరగాలి. సామాజికన్యాయం అనేది నేతిబీరకాయలో నెయ్యి కారాదు. సమాజంలో అందరూ బాగుండాలి అందులో కాపులు కూడా ఉండాలన్నదే మా వైఖరి.
రిజర్వేషన్ల అమలులో టి.డి.పి.కూటమి ప్రభుత్వంవారు ద్వంద్వ విధానాలను, ద్వంద్వ నీతిని సత్వరమే విడనాడాలి. బి.సి.లకు స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్ట్‌లలోనే కాదు విద్య, ఉద్యోగాలలో కూడా 34% రిజర్వేషన్లు కల్పించాలి. అక్కడొక న్యాయం, ఇక్కడొక న్యాయం ఎంతకాలం ఈ ద్వంద్వ న్యాయం, ఈ ద్వంద్వ నీతి, ద్వంద్వ విధానాలు? బి.సి. రిజర్వేషన్ల అమలులో యూనిఫామ్‌గా ఒకే విధానాన్ని కొనసాగించాలి.
కాపులు మినహా ఇతర ఓ.సి.లు – బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ, ఆర్యవైశ్య, రెడ్డి, కమ్మ . . . తదితరులలోని పేదలకు EWS 10% రిజర్వేషన్లు కొనసాగించాలి. EWS 10%లో కాపులకు 5% సబ్‌కోటా అనే మరో మోసాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇంతకాలం బి.సి.రిజర్వేషన్ల పేరుతో బి.సి.లకు, కాపులకు పూడ్చలేని అగాధాన్ని పాలకపక్షాలవారు వారి మనుగడకోసం సృష్టించారు. మరల కొత్తగా ఇతర ఓ.సి.లను కూడా కాపులకు దూరంచేయాలనే కోణంలో కొత్త కుట్రకు తెరలేపారు. EWS 10%లో కాపులకు 5% సబ్‌కోటా అనేది సాధ్యంకాదని వారికి తెలిసికూడా మరో మోసానికి తెరలేపారు. అధికారంలోకి వచ్చిన ఆరు మాసాలలోపు కాపులకు రిజర్వేషన్లుకల్పిస్తామని హామీ ఇచ్చి బి.సి.(ఎఫ్) ద్వారా 5% రిజర్వేషన్లని ఒకసారి, EWS 10%లో 5% సబ్‌కోటా అని మరొకసారి మోసం చేసారు. ఏ రిజర్వేషను కల్పించ కుండా కాపులను నయవంచనకు గురిచేసారు. ఈ నేపధ్యంలో మరాఠాలమాదిరిగా కాపులకు 12% ప్రత్యేకరిజర్వేషన్‌ను మాత్రమే KRPS డిమాండ్ చేస్తోంది. మరో ప్రత్యామ్నాయాన్ని అంగీకరించేది లేదని మా వైఖరిని స్పష్టం చేస్తున్నాం …
– కాపు రిజర్వేషన్ పోరాట సమితి-KRPS
Contact నెంబర్లు : 9553849849, 7396106269, 9246669200,
9133650792, 9966682988, 9346721379.
దయచేసి షేర్ చేయండి, వైరల్ చేయండి.
Be the first to comment