
కాపు ముద్దుబిడ్డ అల్లు అర్జున్ ను ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడానికి తీవ్ర వేధింపులు గురిచేయడాన్ని తెలంగాణ మున్నూరు కాపు సంఘం మరియు రాయల్ యూత్ ఫోర్స్(RPF) – తెలంగాణ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము.
రాజకీయ చదరంగంలో సినిమా హీరోలను బలి చేయడానికి సంఘా ల తరఫున తప్పు పట్టారు తెలుగు హీరో దేశ విదేశాలలో ఒక వరవడిని సృష్టించి *ఆస్కార్ అవార్డు* వచ్చే విధంగా కృషి చేసిన వ్యక్తిని అభినందించాలే తప్ప అరెస్టులు చేయకూడదు. దేశం మొత్తం & నార్త్ వారు సినిమా డైరెక్టర్లు హీరోలు తెలుగువారితో పోటీ పడలేకపోతున్నాం అని బాధను వ్యక్తపరుస్తున్నారు. కథలు యువత చెడిపోతారు అనుకుంటే ప్రభుత్వం సినిమాను ఆపివేయవచ్చును
కేవలం వారు నటులు మాత్రమే డైరెక్టరలు నిర్మాతలు చెప్పినట్టు చేస్తూ మనకు వినోదాన్ని పంచే వారు మాత్రమే ,తొక్కిసలాటలు *ఒకరు చనిపోవడం బాధాకరం అని సారీ చెప్పి 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తామని ఆదుకుంటామని చెప్పినా కూడా కావాలనే వ్యక్తిగత కక్షతో అరెస్టులు చేయడం ఇంటి మీద రాళ్లు దాడి చేయడం సరైన పద్ధతి కాదు.
భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ నుండి తరలి వెళ్ళిపోయే పరిస్థితి రాకూడదని ఇంకోసారి ఎలాంటి సంఘటనలు ఘటనలు జరగకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలని కక్ష సాధింపు చర్యలు మంచివి కావని ముక్తకంఠంతో ఖండిస్తున్నాము
తెలంగాణ మున్నూరు కాపు సంఘం & రాయల్ యూత్ ఫోర్స్ తెలంగాణ
Be the first to comment