
15.04.2025, మంగళవారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – వసంత ఋతువు చైత్ర మాసం – బహుళ పక్షం
తిథి:విదియ ఉ8.30 వరకు
వారం:భౌమవాసరే (మంగళవారం)
నక్షత్రం:విశాఖ రా12.49 వరకు
యోగం:సిద్ధి రా9.34 వరకు
కరణం;గరజి ఉ8.30 వరకు తదుపరి వణిజ రా9.26 వరకు
వర్జ్యం:ఉ.శే.వ 6.15 వరకు
మరల తె5.12 నుండి
దుర్ముహూర్తము:ఉ8.17 – 9.06
మరల రా10.50 – 11.36
అమృతకాలం:మ3.05 – 4.51
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:మేషం
చంద్రరాశి:తుల
సూర్యోదయం:5.49
సూర్యాస్తమయం:6.11
నేడు ప్రపంచ కళా దినోత్సవం.
‘మడిసన్నాక కాసింత కలాపోసన ఉండాల… పొద్దస్తమానం తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటది? ‘ అనేది తెలుగువారికి ఎంతో సుపరిచితమైన వాక్యం. నిజమే! చతుష్షష్టి (64) అంటూ మనవాళ్లు చెప్పిన వాటిలో ఏదో ఒక కళలో అభినివేశమో… కనీసం అభిరుచో లేకుండా- బతుకంతా గానుగెద్దులాగే గడిచిపోతే అర్థం ఏముంటుంది ?
ప్రపంచ ప్రఖ్యాత మోనాలిసా పెయింటింగ్ తెలియని వారు వుండరు. ఈ పెయింటింగ్ చాలా విశిష్టమైనది. ఈ పెయింటింగ్ చూస్తే విచిత్రమైన అనుభూతి కలుగుతుందిట. ఒక్కక్కసారి నవ్వుతున్నట్టు కనిపిస్తుందిట. ఇంకోసారి చూస్తే కోపంగా కనిపిస్తుందిట. ఈ పెయింటింగ్ మీద అనేకమైన శాస్త్రీయమైన ప్రయోగాలు చేస్తున్నారుట.
ప్రపంచ కళా దినోత్సవం ప్రతి ఏట (2012 నుండి) ఏప్రిల్ 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. సృజనాత్మకతపై ప్రపంచంవ్యాప్తంగా అవగాహన కలిపించడంకోసం ప్రపంచ కళల అసోసియేషన్ ఈ దినోత్సవాన్ని నిర్ణయించింది. ఇటలీకు చెందిన చిత్రకారుడు లియొనార్డో డావిన్సి గౌరవార్థం ఆయన పుట్టినరోజైన ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవం గా ప్రకటించారు.
దాదాపు 523 సంవత్సరాల క్రితం లియోనార్డో దావిన్సీ చిత్రించిన ‘మోనాలిసా’ రూపచిత్రం ప్రపంచం ప్రసిద్ధి చెంది నేటికి వన్నె తరగని అపురూప విశ్వ కళాఖండంగా నిలిచింది. ఎందుకంటే మరే కళాఖండానికి ఇంతటి ప్రఖ్యాతి లభించలేదు. ఆ మోనాలిసా’ చిత్రంలోని యువతి పదనంలో వెల్లివెరిసే చిరుదరహాస రహస్యం ఏమై ఉంటుందోనని ఎందరో కళా విమర్శకులు చర్చలు జరిపారు. ‘మోనాలిసా’ చిత్రాన్ని దావిన్సీ 77×53 సెంటీమీటర్ల సైజులో ఆయిల్ పెయింటింగ్ తో మూడేళ్ళ పాటు చిత్రించి 1503లో పూర్తి చేసారు.
Be the first to comment