
ఇవాళ విశాఖకు ప్రధాని, సీఎం చంద్రబాబు, పవన్
ప్రపంచ యోగా దినోత్సవంలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం 6.40 గంటలకి విశాఖ చేరుకుంటారు. ఆయనకు స్వాగతం పలికేందుకు సా.5.30కి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అక్కడికి చేరుకుంటారు. శనివారం ఉ.6.25కి యోగాంధ్ర–2025 కార్యక్రమం ప్రారంభమవుతుంది. RK బీచ్ నుంచి భీమిలి వరకు 26 కి.మీ మేర ఏర్పాట్లు చేశారు. రికార్డుస్థాయిలో 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టనుంది.
Be the first to comment