
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం…
మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తురక కిషోర్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు…
కిషోర్ గత వైసిపి ప్రభుత్వం లో అనేక అరాచకాలకి పాల్పడి పలు కేసులలో నిందితుడిగా ఉన్నాడు…
2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన కిషోర్ అప్పటినుండి పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న కిషోర్ ను పోలీసులు ఈరోజు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు…
స్థానిక సంస్థల ఎన్నికలలో టిడిపి నేతలు బొండాఉమా ,బుద్ధ వెంకన్నల పై మాచర్ల పట్టణంలో దాడి చేసి న కేసులో ప్రధాన నిందితుడు….
డిసెంబర్ 16 ,2022 న తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డి పై దాడి చేసిన కిషోర్, దాడి అనంతరం మాచర్ల పట్టణం లో వైసీపీ నాయకులను వెంటబెట్టుకొని టిడిపి ఆస్తులను, పార్టీ కార్యాలయం వాహానాలని ధ్వంసం చేసిన ఘటనలలో ప్రధాన నిందితుడు…
2024 మే నెలలో జరిగిన సాధారణ ఎన్నికలలో మాచర్ల నియోజకవర్గం లో పోలింగ్ రోజున పలు హింసకాండలో ప్రధాన నిందితుడు…
రెంటచింతల మండలం పాలువాయి గేటు లో పోలింగ్ రోజు అక్కడ ఏజెంట్గా ఉన్న నంబూరు శేషగిరిరావుపై దాడి చేసి గాయపరిచిన సంఘటనలో ప్రధాన నిందితుడు అలాగే మాచర్ల పట్టణం పీడబ్ల్యుడి కాలనీలో టిడిపి నేత ఎనుముల కేశవరెడ్డి ఇంటిపై విధ్వంసానికి పాల్పడి పలువుని గాయపరిచిన సంఘటనలో ప్రధాన సూత్రధారి…
పోలింగ్ మరుసటి రోజు కారంపూడి పట్టణంలో సీఐ నారాయణస్వామి పై దాడి చేసి ,విధ్వంసానికి పాల్పడి టిడిపి కార్యాలయం ,తెలుగుదేశం నాయకుల వాహనాలు ధ్వంసం చేసి, వారి ఇళ్లను లూటీ చేసిన కేసులో ప్రధాన నిందితుడు…
Be the first to comment