
తూర్పు కాపు ఆత్మీయ కలయుకకు భారీ ఏర్పాట్లు
కలిసికట్టుగా అందరికీ ఆహ్వానాలు
శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపుల ఆత్మీయ కలయికకు ఎచ్చెర్ల వద్ద భారీ ఏర్పాట్లు జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈనెల 29 తేదీ ఆదివారం తూర్పు కాపు ఆత్మీయ కలయిక జరగనున్నది. ఇందుకోసం జిల్లా నలుమూలల్లో ఉన్న తూర్పు కాపు కుటుంబ సభ్యులందరకూ ఆహ్వానాలు అందించే విధంగా పెద్దా,చిన్నా అని తేడా లేకుండా సంక్షేమ సంఘం సభ్యులు బృందాలుగా ఏర్పడి ఆహ్వాన పత్రికలు అందిస్తున్నారు. ఆత్మీయ కలయిక తూర్పు కాపుల ఇంటి పండగగా నిర్వహించేందుకు జిల్లాలో ఉన్న తూర్పు కాపులందరూ నడుం బిగించారు. శ్రీకాకుళం జిల్లాలో తూర్పు కాపులు అత్యధికంగా ఉన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలను శాసించే విధంగా తూర్పు కాపులకు బలం ఉంది.గత కొంతకాలంగా తూర్పుకాపులకు రాజకీయంగా సరైన ప్రాధాన్యత లభించలేదని నిరాశ, నిస్పృహలో ఉన్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం సుడా చైర్మన్ గా ప్రముఖ పారిశ్రామికవేత్త, జనసేన నాయకులు కొరికాన రవికుమార్ ను నియమించారు. అంగ బలం, అర్థబలం ఉన్న నాయకుడిని నియమించడంతో కాస్త ఉత్సాహం వచ్చినట్లు అయింది.
Be the first to comment