
28.04.2025, సోమవారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – వసంత ఋతువు
వైశాఖ మాసం – శుక్ల పక్షం
తిథి:పాడ్యమి రా10.57 వరకు
వారం:ఇందువాసరే (సోమవారం)
నక్షత్రం:భరణి రా11.28 వరకు
యోగం:ఆయుష్మాన్ రా9.49 వరకు
కరణం:కింస్తుఘ్నం మ12.20 వరకు
తదుపరి బవ రా10.57 వరకు
వర్జ్యం:ఉ10.03 – 11.32
దుర్ముహూర్తము:మ12.22 – 1.12
మరల 2.52 – 3.43
అమృతకాలం:సా6.59 – 8.29
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:మేషం
చంద్రరాశి: మేషం
సూర్యోదయం:5.40
సూర్యాస్తమయం:6.14
వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ. ఈ రోజున చేసే వ్రతాలు, పుణ్యకార్యాలు, దానధర్మాలు, నిష్ఠతో చేసే ప్రార్థనలు,కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడని ప్రతీతి.*అక్షయ తృతీయ సాక్షాత్తూ ఆ జగన్మాత అవతరించిన సుతిథి.* పరమోత్కృష్టమైన అక్షయ తృతీయ రోజునే ప్రహ్లాదుని నరసింహస్వామి అనుగ్రహించినట్లు,
మరి అలాంటి అక్షయ తృతీయ మనందరికీ ఎంత గొప్ప పర్వదినం..! ఎంత మంగళకరం..!
*అపార కారుణ్య, సౌశీల్య, వాత్సల్య, ఔదార్య మహోదధి – మన పరమదైవం శ్రీమన్నారాయణుడు…!*
*శ్రీ విష్ణు హృత్కమలవాసిని, నిత్యానపాయిని, నిరవద్య, ఐశ్వర్య ప్రదాయిని మన అమ్మ శ్రీ మహాలక్ష్మీ దేవి..!*
*శ్రీలక్ష్మీ నారాయణుల దివ్యానుగ్రహంతో మనమంతా ఐశ్వర్య సిద్ధి పొందే అలాంటి సుదినం. ఈ హవనంలో సకుటుంబసమేతంగా పాల్గొనే సదవకాశముంది. అసంఖ్యాకంగా పాల్గొనండి. శ్రీదేవి శ్రియ:పతుల అనుగ్రహానికి పాత్రులు కండి.*
*అక్షయ తృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు ?*
సింహాచలంలో వరాహ నరసింహ స్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది !
ఆరోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు.
దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజ రూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు.
*ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ?*
పూర్వం తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడేందుకు , విష్ణుమూర్తి నరసింహ అవతారం దాల్చిన విషయం తెలిసిందే.
ఆ సందర్భంగా తన కోసం సింహాచలం కొండ మీద శాశ్వతంగా కొలువుండమంటూ ప్రహ్లాదుడు నారసింహుని వేడుకున్నాడు. ప్రహ్లాదుని కోరికను మన్నించి స్వామివారు ఇక్కడ వెలిశారు.
ఆ స్వామివారికి బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించి , నిత్యం ఆయనను కొలుచుకునేవాడట ప్రహ్లాదుడు. అయితే కాలం మారింది. యుగం మారింది. సింహాచలం మీద ఉన్న ఆలయం శిథిలమైపోయింది.
చాలా సంవత్సరాల తరువాత ఈ ప్రాంతానికి పురూరవుడు అనే రాజు విహారానికి వచ్చాడు.
అప్పుడు ఆయనకు స్వామివారు కలలో కనిపించి…. తన విగ్రహం ఒక పుట్టచేత కప్పబడి ఉందనీ , ఆ పుట్టని తొలగించి తనని దర్శించమనీ చెప్పారు.
అప్పుడు పురూరవ మహారాజు సహస్ర ఘటాలతో పుట్ట మీద నీరు పోసి స్వామివారి నిజరూపాన్ని దర్శించారు. ఇదంతా జరిగింది అక్షయ తృతీయ రోజునే అని స్థలపురాణం చెబుతోంది.
ఉగ్రమూర్తి అయిన నరసింహుని రూపానికి ప్రకృతి యావత్తూ తల్లడిల్లిపోగలదు.
అందుకనే తన మీద చందనాన్ని లేపనం చేయమని పురూరవునికి నారసింహుడు ఆదేశించారు.
ఇక మీదట తన నిజరూపాన్ని ఏటా ఒక్కసారి మాత్రమే భక్తులు చూడగలరనీ, మిగతా సమయాలలో చందనపు పూతతో నిండిన తన నిత్య రూపాన్ని మాత్రమే చూస్తారనీ అనుగ్రహించారు.
అలా స్వామి వారి ఆదేశంతో అక్షయ తృతీయ రోజున మాత్రమే ఆయన నిజ రూపాన్ని దర్శించేందుకు చందనోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
Be the first to comment