
సాయి దుర్గా తేజ్ కు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుభాభినందనలు తెలియచేశారు
* వెండి తెరపైకి వచ్చి దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా మేనమామ ఆశీస్సులు తీసుకున్న మేనల్లుడు
యువ కథానాయకుడు శ్రీ సాయి దుర్గా తేజ్ వెండి తెరపైకి వచ్చి దశాబ్దం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుభాభినందనలు తెలియచేశారు. నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న సాయి దుర్గా తేజ్ ఎంతో సామాజిక బాధ్యతతో మెలగడం సంతోషదాయకం అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. శ్రీ సాయి దుర్గా తేజ్ గురువారం సాయంత్రం మంగళగిరిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “నటనపట్ల ఎంతో తపనతో ఎదుగుతూ వస్తున్నాడు సాయి తేజ్. నటుడిగా తొలి అడుగులు వేసినప్పటి నుంచీ సహ నటులు, సాంకేతిక నిపుణులపట్ల ఎంత గౌరవమర్యాదలతో ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ప్రతి విషయంపట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తాడు. అదే విధంగా తను ప్రమాదంలో చిక్కుకొన్నప్పుడు కూడా ఎంతో ఆత్మ విశ్వాసం చూపించాడు. తనకు ఎదురైన పరిస్థితి మరెవరికీ రాకూడదనే ఆలోచనతో రహదారి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకుతున్నాము..
Be the first to comment