
ఘనంగా 2025 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
సత్రం అభివృద్ధికి కృషి చేస్తాం
ఆళ్లగడ్డ: మండలంలోని అహోబిలం లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శ్రీకృష్ణదేవరాయ బలిజ కాపు తెలగ ఒంటరి నిత్యాన్నదాన సత్రం 2025 నూతన క్యాలెండర్ ను లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో శుక్రవారం సత్రం అధ్యక్షులు శెట్టి విజయ్ కుమార్,జిల్లా సంఘం నాయకులు కోనేటి చంద్రబాబు నాయుడు, గూడూరు సంజీవ రాయుడు, మైలేరి మల్లయ్య, రామకృష్ణ, పత్తి సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. సత్రం అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని చెప్పారు. అన్నివర్గాల వారికి సత్రం సేవలను అందిస్తామని చెప్పారు. తమ సంఘం అభివృద్ధికి ఐక్యమత్యంగా కృషి చేస్తామన్నారు. విద్య, రాజకీయం, ఆర్థికంగా అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరు సత్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కొట్టుకూరు తిరుపాలు, పత్తి సూర్యనారాయణ,కసెట్టి నాగిరెడ్డి, కొల్లం పుల్లయ్య, నీలి రామారావు, శ్రీపతి ప్రసాదు, మునయ్య, సిద్ది నారాయణ, గాంతి శ్రీను, అంగం శివ రాయల్, బండి రామచంద్రుడు, రాచంశెట్టి వెంకటసుబ్బయ్య, హరి ఓం కృష్ణ, శ్రీనివాసులు, ఇతర సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Be the first to comment