
కాకినాడలో కాపు వన మహోత్సవం కార్యక్రమం
ఈనెల 24న జరగబోయే కాపు కార్తీక మాస వన భోజన మహోత్సవానికి కాపు లందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆంధ్ర కాపు సద్భావన సంఘం, కాపునాడు కాకినాడ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వాసిరెడ్డి ఏసుదాసు, చిట్నీడి శ్రీనివాసు పిలుపునిచ్చారు. కాకినాడ ఎన్ఎఫ్సిల్ రోడ్డులో గల శుభం కాపు కళ్యాణ మండపం ఆవరణంలో జరగబోయే ఈ కార్యక్రమానికి ఆంధ్ర తెలంగాణ నుంచి పలువురు కాపు ప్రముఖుల హాజరవుతున్నారని వివరించారు. ప్రస్తుతం కాపు కులానికి చెందిన ప్రజా ప్రతినిధులుగా పనిచేస్తున్న 22 మంది శాసనసభ్యులు, ముగ్గురు పార్లమెంట్ సభ్యులు, ఏడుగురు ఎమ్మెల్సీలు, మొత్తం 35 మందిని సత్కరిస్తున్నట్లు తెలిపారు. ఐదుగురు మంత్రులతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్తీక వనసమరాదనకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే వీరందరినీ ఆహ్వానించినట్లు అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. సుమారు 30 నుంచి 40 వేల కాపు కులస్తులు కార్తీక మాస వనభోజనానికి వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. వీరితోపాటు గతంలో పనిచేసిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు తోపాటు వైద్యులు,న్యాయవాదులు,ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులు హాజరవుతారని 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Be the first to comment