
స్పందన లో బొండా సిద్దార్థ్ గారి జన్మదినోత్సవం
గన్నవరం మండలం దావాజీగూడెంలో హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పందన మానసిక వికాస కేంద్రం నందు సోమవారం నాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బొండా ఉమామహేశ్వరరావు గారి పెద్ద కుమారుడు సిద్దార్థ్ కి జన్మదినోత్సవ వేడుకలు మానసిక దివ్యాంగుల మధ్యలో ఘనంగా జరిగింది..
ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ సెక్రటరీ సంకాబత్తుల రజిత వెంకట్ మాట్లాడుతూ ప్రజా నాయకులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బొండా ఉమామహేశ్వరరావు గారి పెద్ద కుమారుడు సిద్దార్థ్ గారి పుట్టిన రోజు కార్యక్రమం చెయ్యడం జరిగిందని ఆమె అన్నారు. మా స్పందన లో మానసిక దివ్యాంగులకు ఉచితంగా విద్యా వైద్య రవాణా భొజన సౌకర్యాలను అందించడం జరుగుతుందని రజిత వెంకట్ తెలిపారు.
హల్పింగ్ హ్యండ్స్ సొసైటీ చైర్మన్ సంకాబత్తుల వెంకట్ మాట్లాడుతూ మా అన్న,పేద ప్రజల మనిషి,ఎప్పుడు అంటే అప్పుడు పలికే వ్యక్తి,ప్రజలకే జీవితం అంకితం చేసిన గొప్ప మహోన్నతమైన గొప్ప వ్యక్తి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారి పెద్దకుమారుడు సిద్దార్థ్ పుట్టిన రోజు మా స్పందన మానసిక వికాస కేంద్రం లో చెయ్యడం ఎంతో సంతోషం కలిగించిందని ఆయన అన్నారు. సిద్దార్థ్ అత్యున్నతమైన స్దానంలో రావాలని,తండ్రి గారు బాటలో పేద ప్రజలకు మరిన్ని సేవలు చేసే భాగ్యం కలగాలని,భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వెంకట్ అన్నారు
సిద్దార్థ్ గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని మానసిక దివ్యాంగులకు భొజనాలు మరియు స్వీట్లు,పండ్లు,పుస్తకాలు,పెన్నులు, పెన్సిల్స్ అందించడం జరిగింది.ఈ కార్యక్రమం లో సిబ్బంది పాల్గొన్నారు.
Be the first to comment