
పవన్ కళ్యాణ్ గారి కాకినాడలో పర్యటన కొంత మందికి ఎలేవేషన్ కావొచ్చు. కాని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు యుద్ధం ప్రకటించింది ఒక అతి పెద్ద మాఫియాపై. అది మీరు అనుకునే అంత చిన్న నెట్వర్క్ కాదు.
ఆ మాఫియాలో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు, పోలీస్ అధికారులు, రెవిన్యూ అధికారులు, మీడియా వాళ్లు, కంపెనీల ఓనర్స్ భాగస్వామ్యం అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇది మొత్తం లాగితే వాళ్ళు ఎక్కడ బయటకి వస్తామో అని ప్లాన్ బి అమలు చేస్తారు. తమ వ్యాపార సామ్రాజ్యాన్ని కూలదోశాడు అని ఆ విదేశీ పెద్ద చేపలకి, ఇక్కడ సహకరిస్తున్న చిన్న చేపలకి పవన్ కళ్యాణ్ గారు ఏకైక టార్గెట్ అవుతారు.ఇది సినిమా కాదు హీరో వచ్చి కొట్టెయ్యడానికి.
అలాగే వాళ్ళు టార్గెట్ ఏ విధంగా అయినా చెయ్యొచ్చు. మీడియా ద్వారా తప్పుడు ప్రచారంతో గాని, సోషల్ మీడియా లో నెగటివ్ ప్రచారంతో గాని, లేదా ఇతర హీరోల అభిమానులు ముసుగులో ఫ్యాన్ వార్స్ గా మొదలు పెట్టి స్థాయి, పరిధి దాటించడం గాని, అభిమానుల ముసుగులో వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయడం గాని…ఇలా ఏ విధంగా అయినా రావొచ్చు.
పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో హీరో, నిజ జీవితంలో మన లాంటి మనిషే. అందువల్ల రేపు పవన్ కళ్యాణ్ గారిపై ఎటువంటి తప్పుడు వార్త వచ్చినా, దానిలో ఉన్న కుట్ర మీరు జనానికి చెప్పాలి. ఇక నుండి పవన్ కళ్యాణ్ గారికి మీ మద్దతు మరింత ఎక్కువ అవసరం పడుతుంది.జనం జనసేనాని వెంట ఉంటే ఎలాంటి మాఫియా ఏమి చెయ్యలేదు.🙏
Be the first to comment