బంటుమల్లి లో “మొబైల్ కాన్సర్ వాన్” కార్యక్రమంకు అద్భుత స్పందన!

బంటుమల్లి లో “మొబైల్ కాన్సర్ వాన్” కార్యక్రమంకు అద్భుత స్పందన!
అధిక సంఖ్యలో రావడం వల్ల వచ్చే నెలలో మళ్ళీ వస్తుంది అని MP గారి మాట
కార్యక్రమం దగ్గర ఉండి సహకరించిన జనసైనికులకు ఎంపీ గారి అభినందనలు

మచిలీపట్టణం MP శ్రీ బాలశౌరి గారి సహకారంతో BEL వారి CSR నిధులతో వచ్చిన ” *మొబైల్ కాన్సర్ వాన్* ” అధునాతన సదపాయాలు కలిగి వివిధ రకాల కాన్సర్ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. కాన్సర్ ను ముందుగానే గుర్తించి వైద్యం చేయించుకుంటే కాన్సర్ వల్ల కలిగే మరణాలు తగ్గించాలనే సదుద్దేశ్యంతో మన ఊరిలోకి వచ్చి పరీక్షలు చేసేలా ” *మొబైల్ కాన్సర్ వాన్* ” రూపకల్పన చేసారు.

నిన్న బంటుమిల్లి లో జరిగిన ఈ క్యాంపు ప్రజలు బాగా ఉపయోగించుకున్నారు, TEST లు కోసం ప్రజలు అధిక సంఖ్యలో రావడం వల్ల ఇంకా చేయవలిసినవి ఉండడం వాళ్ల MP గారి ని రిక్వెస్ట్ చెయ్యటం జరిగింది , వెంటనే స్పందించి వచ్చే నెలలో మళ్ళీ పంపుతాము అని మాట ఇచ్చారు.

ఈ ప్రోగ్రాం దగ్గర ఉండి చూసుకున్న జనసైనికులు యడ్లపల్లి రూకేష్ గారిని, మారుబోయన సుబ్బు గారిని, రుద్రపాక సాయిరాం గారిని, గొట్రూ రవికిరణ్ గారిని, కంచడం భూపతి గారిని ప్రత్యేకంగా MP బాలశౌరి గారు అభినందించారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*