
భూఅక్రమాల్లో ఎక్కడ చూసినా YCP నేతలే: హోంమంత్రి
AP: కాకినాడ పోర్టు వ్యవహారంలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయని హోంమంత్రి అనిత అన్నారు. బియ్యం అక్రమ రవాణా మీద CIDతో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ఎక్కడ భూ అక్రమాలు చూసినా YCP నేతల పాత్ర ఉందని ఆరోపించారు. విశాఖలో మాజీ MP ఎంవీవీ సత్యనారాయణ అక్రమాలు బయటికొచ్చాయన్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపామని, ఈగల్ వ్యవస్థ అప్పుడే పని మొదలుపెట్టిందని హోంమంత్రి విశాఖలో వెల్లడించారు
Be the first to comment