
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చరిత్రాత్మక నిర్ణయం తీసుకొని జాతీయ జనగణలో కులగణన నిర్వహిస్తున్నందుకు వారికి తెలంగాణ బలహీన వర్గాల సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ అభినందనలు తెలియజేశారు..
ఎన్నో ఏండ్లుగా దశాబ్దాలుగా బీసీలంతా కులగణన నిర్వహించాలని అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించి ఎన్నో కమిషన్లు వేసి చిట్ట చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతీయ జనగణలో కులగణన నిర్వహిస్తామని తెలియజేయడం భారతదేశంలో ఉన్న 90 కోట్ల మంది బీసీలకు శుభవార్త చెప్పడం పట్ల తెలంగాణ బలహీన వర్గాల సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ అభినందనలు తెలియజేయడం జరిగింది.. సమయపాలన వహించి తొందరగా బీసీల కులగణన నిర్వహించి రిజర్వేషన్లు పెంచాలని ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి వెంట యావత్తు బీసీలంతా ఉంటారని తొందరలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేమంతా అండగా ఉంటామని వారికి తెలియజేస్తునామాని అన్నారు. ఈ కార్యక్రమంలో బత్తుల రాములు కటికం మహేష్ రామిని సందీప్ వెంపటి సోమన్న అమరం శ్యాం కుమార్ పత్తి అనిల్ ఓయూ మల్లేష్ కషంశెట్టి కృష్ణ మరియు బిసి బాంధవులు పాల్గొన్నారు′
Be the first to comment