
ఉత్తర మహారాష్ట్రలోని నందుర్బర్ జిల్లా కేంద్రంలోజరిగిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభకిహాజరైన పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్
ఉత్తర మహారాష్ట్రలోని నందుర్బర్ జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభకి ముఖ్యఅతిథిగా హాజరైన పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఏఐసీసీ సీనియర్ అబ్జర్వర్ సీతక్క ఘన స్వాగతం పలికారు. పార్టీ కండువా కప్పి రాహుల్ గాంధీని వేదిక మీదకి సీతక్క ఆహ్వానించారు. అనంతరం గిరిజన పోరాట వీరుడు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా ప్రతిమను బహుకరించి రాహుల్ గాంధీని మంత్రి సీతక్క సత్కరించారు. శుక్ర వారం నాడు బిర్సా ముండా జయంతి నేపథ్యంలో సీతక్క బహుకరించిన బిర్సా ముండా ప్రతిమ రాహుల్ గాంధీ ని ఆకట్టుకుంది. బిర్సా ముండా ప్రతిమను అందుకున్న రాహుల్ గాంధీ కాసేపు ప్రతిమను చూస్తూ వుండి పోయారు. అనంతరం ప్రసంగించిన రాహుల్ గాంధీ ఆదివాసి గిరిజనుల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివాసీల ఆస్తిత్వాన్ని, ప్రత్యేక సంస్కృతిని దెబ్బతీస్తున్న బిజెపి కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. అటవీ హక్కుల చట్టం తో పాటు, వారి రక్షణ కోసం ఎన్నో చట్టాల రూపొందించిన కాంగ్రెస్ను బలపరచాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Be the first to comment