
ఏనుగుల నుంచి పంట, ప్రాణ నష్టాన్ని అరికట్టండి..!!
ప్రభుత్వ ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి అజయ్ కుమార్ నాయక్ గారికి వినతి..
_ చంద్రగిరి జనసేన ఇన్చార్జ్ దేవర మనోహర్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఏనుగుల దాడులు నుంచి పంట, ప్రాణా నష్టాన్ని అరికట్టాలని చంద్రగిరి జనసేన పార్టీ ఇన్చార్జ్ దేవర మనోహర్ ప్రభుత్వ ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి అజయ్ కుమార్ నాయక్ వినతిపత్రం సమర్పించారు. బుధవారం విజయవాడలోని అజయ్ కుమార్ నాయక్ ను కలిసి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా దేవర మనోహర్ మాట్లాడుతూ
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇటీవల కాలంలో ఏనుగుల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ సమస్య వల్ల రైతుల ప్రాణాలకు, పంటలకు, ఆస్తులకు భారీ నష్టం జరుగుతోంది.
*ప్రస్తుత పరిస్థితి*
1. ఏనుగులు రోజుకు అనేకసార్లు గ్రామాల్లోకి ప్రవేశించి, పంటలు, ఇళ్లు, నిల్వ ధాన్యాన్ని నాశనం చేస్తున్నాయి.
2. కొందరు రైతులు తమ పొలాల్లో రాత్రులు కాపలా కాస్తున్నారు, కానీ ఏనుగుల దాడులను నుంచి తమను తాము రక్షించు కోలేకపోతున్నారు.
3. ఇటీవల చిన్నగొట్టిగల్లు మండలం, చిట్టేచర్ల పంచాయతీ, దాసరిగూడెంలో రైతు సిద్దయ్య ఏనుగుల దాడిలో మృతి చెందారు.
– 4.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 ఏళ్లలో 42 మంది గజదాడులకు బలైపోయారు. వీరిలో కొద్దిమంది మినహా ఆరుగాలం కష్టించి సాగుచేసిన పంటలను రక్షించుకునే క్రమంలో ప్రాణాలు పోగొట్టుకున్న రైతులే వున్నారు.
*ప్రభుత్వ ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి వినతి*
1. **ఎలక్ట్రిక్ ఫెన్సింగ్* మరియు సోలార్ ఫెన్సింగ్ వేయడం, అటవీ సమీప ప్రాంతాల్లో కందకాలు తవ్వడం ద్వారా ఏనుగులను అడవి వైపుకు తరలించవచ్చు.
2. **వన్యప్రాణి శాఖ సిబ్బంది సంఖ్యను** పెంచడం, తద్వారా ఏనుగుల కదలికలపై నిఘా ఉంచవచ్చు.
3. **తక్షణ నష్టపరిహారం** – ఏనుగుల దాడుల వల్ల నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించండం.
4. **దీర్ఘకాలిక పరిష్కారం** కోసం అడవులు మరియు వ్యవసాయ భూముల మధ్య **బఫర్ జోన్లు** ఏర్పాటు చేయడం.
5. **కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్లు** రెవెన్యూ, హార్టీకల్చర్, అగ్రికల్చర్, పోలీస్, ఫారెస్ట్ అధికారులతో అవేర్నెస్ ప్రోగ్రామ్లు నిర్వహించండం, తద్వారా ఏనుగులతో ఎలా వ్యవహరించాలో రైతులు తెలుసుకోవచ్చు.
6. అటవీ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నీటి తొట్టెలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామాల్లోకి రాకుండా అరికట్టవచ్చు
*సానుకూల స్పందన*
పై సమస్యలపై ప్రభుత్వ ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి అజయ్ కుమార్ నాయక్ సానుకూలంగా స్పందించారు. మంచి సూచనలు చేశారని అభినందించారు. త్వరలో ఫీల్డ్ విజిట్ చేస్తానన్నారు. మే 5 వ తేదీన జరగబోయే సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో సమస్యలపై చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని దేవర మనోహర్ అన్నారు.
Be the first to comment