జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన విజయవాడ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు

ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన కార్పొరేటర్లు మహదేవ్ అప్పాజీ (53వ డివిజన్),ఉమ్మడి రాధిక W/o బహదూర్(16వ డివిజన్), అత్తులూరి ఆదిలక్ష్మి W/o వెంకటేశ్వరరావు(48వ డివిజన్), మరుపిల్ల రాజేష్(51వ డివిజన్) మరియు వత్సవాయి మండల జెడ్పీటీసీ యేసుపోగు దేవమణి, జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ కొణిదల పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారందరికీ జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు గారి నాయకత్వం టీడీపీ సుదీర్ఘమైన అనుభవం ఇస్తే జనసేన దానికి బలమైన పోరాట శక్తి ఇచ్చిందని, సామినేని ఉదయభాను గారు జనసేన పార్టీలో చేరితే చాలా మందికి భరోసాగా ఉంటుందని అనుకున్నాను అని, వారు జనసేన లో చేరిన తరువాత వారి ఆధ్వర్యంలో జనసేన పార్టీని మరింత బలం చేకూర్చే విధముగా చేరికలు జరుగుతున్నాయని, ఉదయభాను గారికి తృటిలో నాతో పాటు శాసనసభ్యునిగా పనిచేసే అవకాశం తప్పిందని, అయినా సమీప భవిష్యత్తులో ఉదయభాను గారికి నిర్ణయాత్మక స్థితి దక్కుతుందని, ఈ చేరికలు విజయవాడ నగరంలో మరియు ఎన్టీఆర్ జిల్లాలో పార్టీని క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మరింత ఉపయోగపడతాయని, అదేవిధంగా చేరిన పార్టీలో వారందరికీ పార్టీ కోసం పనిచేయండి సముచిత స్థానం కల్పిస్తాం అని తెలియజేశారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*