
నెల్లూరు జిల్లా…
నెల్లూరు జిల్లాకు రానున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
రెండురోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని ప్రహలగామ్ లో జరిగిన ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా కావలి పట్టణవాసి సోమిశెట్టి మధుసూదన్ మృతి చెందారు, ఆయన మృతదేహం ఈరోజు ఉదయం కావలి పట్టణంలోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు, అధికార లాంచనాలతో ఈ రోజు సాయంత్రం మూడు గంటలకు సోమిశెట్టి మధుసూదన్ అంత్యక్రియలు జరగనున్నాయి, ఈ అంత్యక్రియలో పాల్గొనేందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరుకానున్నారు ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Be the first to comment