
అమలాపురంలో అట్టహాసంగా ప్రారంభమైన బాక్స్ క్రికెట్ పోటీలు..
అమలాపురం స్థానిక గండువీధి నందు గుర్రాల విజయ్ కృష్ణ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ (బాక్స్ క్రికెట్) పోటీలను ఛాంబర్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ బుధవారం ప్రారంభించారు. ఈనెల 28వతేదీన ప్రారంభమైన పోటీలు వచ్చే నెల 3వ తేదీ వరకు కొనసాగుతాయని, ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 30వేల రూపాయలు, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ 15వేల రూపాయలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ ప్రతిపక్ష నేత యేడిద శ్రీను, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ల నాగ సతీష్, నల్లా అజయ్, పడాల నానాజీ, ఆశెట్టి ఆది బాబు, తోట విస్సు, గోకరకొండ తాతాజీ, గారపాటి మార్తాండ, గుర్రాల చందు, దవులూరి తాతాజీ, గోకరకొండ బాల, గండు సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
Be the first to comment