
02, జనవరి, 2025. పంచాంగం:
సూర్యోదయాస్తమయాలు:
ఉ 06.36 / సా 05.47
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : మకరం
స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయణం
హేమంత ఋతౌః / పుష్యమాసం / శుక్లపక్షం
తిథి : తదియ రా 01.08 వరకు ఉపరి చవితి
వారం : గురువారం (గురువాసరే)
నక్షత్రం : శ్రవణం రా 11.10 వరకు ఉపరి ధనిష్ఠ.
యోగం : హర్షణ మ 02.58 వరకు ఉపరి వజ్ర
కరణం : తైతుల మ 01.48 గరజి రా 01.08 ఉపరి వణజి
సాధారణ శుభ సమయాలు
ఉ 11.00 – 12.30 సా 04.00 – 06.00
అమృత కాలం : మ 01.02 – 02.35
అభిజిత్ కాలం : ప 11.49 – 12.34
వర్జ్యం : రా 03.02 – 04.35 తె
దుర్ముహూర్తం : ఉ 10.20 – 11.05 మ 02.48 – 03.33
రాహు కాలం : మ 01.35- 02.59
గుళికకాళం : ఉ 09.24 – 10.48
యమగండం : ఉ 06.36 – 08.00
ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు
వైదిక విషయాలు
ప్రాతః కాలం : ఉ 06.36 – 08.50
సంగవ కాలం : 08.50 – 11.05
మధ్యాహ్న కాలం : 11.05 – 01.19
అపరాహ్న కాలం : మ 01.19- 03.33
ఆబ్ధికం తిధి : పుష్య శుద్ధ తదియ
సాయంకాలం : సా 03.33 – 05.47
ప్రదోష కాలం : సా 05.47 – 08.21
రాత్రి కాలం : రా 08.21 – 11.46
నిశీధి కాలం : రా 11.46 – 12.37
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.54 – 05.45
02-01-2025-గురువారం రాశి ఫలితాలు:
మేషం
ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగమున మార్పులు ఉంటాయి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృషభం
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభ సూచలున్నవి.
మిధునం
ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి.
కర్కాటకం
సోదరులతో ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.
సింహం
వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని విషయాలలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
కన్య
ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. దైవచింతన పెరుగుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు.
తుల
ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం ఉండదు. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి.
వృశ్చికం
ఆస్తి వివాదాలు తొలగుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక సమయంలో ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూలంగా సాగుతాయి.
ధనస్సు
ప్రముఖులతో సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు సంతోషానిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
మకరం
చిన్నపాటి అనారోగ్యాలు తప్పవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన రుణయత్నాలు సాగిస్తారు. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
కుంభం
కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలలో మందకోడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు కొన్ని మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
మీనం
ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరస్తి వివాదాలలో బయటపడటానికి ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది
Be the first to comment