పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేసిన అల్లు అర్జున్

ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయి గారికి కృతజ్ఞతలు తెలియజేసిన అల్లుఅర్జున్

భారీ బడ్జెట్ సినిమా పుష్పకి స్పెషల్ జిఓ ఇచ్చి రేట్లు పెంచుకోవడానికి, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి సహకరించినందుకు కళ్యాణ్ గారిని బాబాయ్ అని సంబోధించడానికి కారణం బహుశా బన్నీ చిన్నపటి నుండి సినిమా పరంగా చిరంజీవి గారిని తండ్రి గాను కళ్యాణ్ గారిని బాబాయి గాను భావిస్తూ ఉండడమే..

తెలుగు సినిమా పరిశ్రమలో తను ఒక శిఖరంలా ఎదగడమే కాకుండా, క్రమశిక్షణతో స్వయంకృషితో ఎదిగేలా చేసి అనితర సాధ్యమైన పర్వత శ్రేణి తయారుచేసి సినీ పరిశ్రమకి, మెగా కుటుంబానికి ఒక గాడ్ ఫాదర్ గా నిలిచారు..

రేవతి చనిపోయిన విషయం నాకు మరుసటి రోజు తెలిసింది

కోలుకోవడానికి మాకు కోలుకోవడానికి 2 రోజులు పట్టింది

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంపై మరోసారి స్పందించిన అల్లు అర్జున్

గత 20 ఏళ్లుగా నేను ఆ థియేటర్‌కు వెళ్తున్నాను.. మొన్న సినిమా చూస్తుండగా మా మేనేజర్ వచ్చి బయట గందరగోళంగా ఉంది.. వెళ్లిపోమని చెప్పారు.

ఆ తర్వాత రోజు ఈ ఘటన గురించి తెలిసింది. ఆ షాక్లో వెంటనే స్పందించలేకపోయాను.

ఆమె కుటుంబానికి సారీ చెబుతున్నా.. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం – అల్లు అర్జున్

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*