ముఖ్య అతిథిగా విచ్చేసిన అహుడ చైర్మన్ శ్రీ టి.సి.వరుణ్ గారు..

శ్రీ చైతన్య స్కూల్ లో ఘనంగా గురు సన్మాన సభ…

ముఖ్య అతిథిగా విచ్చేసిన అహుడ చైర్మన్ శ్రీ టి.సి.వరుణ్ గారు...

కరతాల ధ్వనులతో స్వాగతం పలికిన విద్యార్థులు..

జ్యోతి ప్రజ్వలన చేసిన ఏజీఎం సుబ్బారెడ్డి.. అహుడ చైర్మన్ శ్రీ టీ.సి.వరుణ్ గారు…

విద్యార్థులంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అమితమైన ప్రేమ…

విద్యార్థులు అంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అమితమైన ప్రేమ అని అహుడా చైర్మన్ శ్రీ టి.సి.వరుణ్ గారు అన్నారు. అనంతపురము హౌసింగ్ బోర్డ్ శ్రీ చైతన్య బాలికల రెసిడెన్షియల్ స్కూల్ లో గురు సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అహుడా చైర్మన్ శ్రీ టీ.సి.వరుణ్ గారు, ఏ.జీ.ఎం.సుబ్బారెడ్డి గారు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరతాల ధ్వనులతో శ్రీ టీ.సీ.వరుణ్ గారికి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ టి.సి.వరుణ్ గారు మాట్లాడుతూ… నేడు ఉపాధ్యాయులు లేకుంటే ఏ రంగం అభివృద్ధి చెందదన్నారు. విద్యాబుద్ధులను నేర్పి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడంలో వారి పాత్ర గణనీయమైనదని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ విషయ నిపుణులైన ఉపాధ్యాయులకు 2023-24 లో 598 మార్కులతో స్టేట్ ర్యాంకు సాధించడానికి దోహదపడిన ఉపాధ్యాయులకు పురస్కారాలను, నగదు బహుమతిని ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ టి.సి.వరుణ్ గారి చేతుల మీదుగా అందించారు. అధ్యాపకులు వారి అనుభవాలను మాట పాట పద్య కవితల రూపంలో విద్యార్థులతో పంచుకున్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షులు శ్రీ పొదిలి బాబురావు, జిల్లా కార్యదర్శి శ్రీ సిద్దు, ప్రిన్సిపల్ శ్రీ సమీనా ఖాన్, వైస్ ప్రిన్సిపల్ శ్రీ షమీనా, అకాడమిక్ కోఆర్డినేటర్లు శ్రీ రాధాకృష్ణ, శ్రీ ఇర్షాద్, శ్రీ తిరుమలేష్, శ్రీ నాగభూషణం, డీన్ శ్రీ సత్యనారాయణ, శ్రీ చంద్రమోహన్, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్స్, డీన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*