
గత పది సంవత్సరాలుగా జవాబు దారీతనాన్ని చూపిస్తామంటూ న్యూ ఏజ్ పాలిటిక్స్ కి నిలువుటద్దం లా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా నడవడం సగర్వంగా భావిస్తున్నాం….
*కిషోర్ గునుకుల-జనసేన పార్టీ*
నెల్లూరు కమీషనర్ గారిని కార్పొరేషన్ లోని పలు సమస్యల గురించి జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్,కృష్ణారెడ్డి మరియూ ఇతర నాయకుల తో జిల్లా ప్రధాన కార్యదర్శి,నెల్లూరు సిటీ పర్యవేక్షకులుకిషోర్ గునుకుల కలవడం జరిగింది.
మూడవ డివిజన్లోని కాలవలు లేకపోవడాన్ని… 51వ డివిజన్లో డస్ట్ బిన్ లేక సరిగ్గా క్లీనింగ్ చేయక అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాన్ని పరిశీలించాలని అదేవిధంగా 49వ డివిజన్ మెట్ల రేపు సాయిబాబా మందిరం నందు కాలువ కోసం డ్రైనేజీ వ్యవస్థ కోసం తవ్విన రోడ్లను వైసీపీ నిర్లక్ష్యం వల్ల అలాగే వదిలిపోవడం వల్ల కింద పంది కుక్కలు లోడి రోడ్డు పడిపోయేటట్టు మన విషయాన్ని కమీషనర్ గారి దృష్టికి తీసుకువచ్చారు.
హరనాధ పురంలో ఆర్ అండ్ బిల్డింగ్ బార్డర్ దాటి ఉన్న ఆక్రమణలు తొలగించవలసిందిగా కిషోర్ కోరారు…
మున్సిపల్ శాఖామాత్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు,నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ గారు సమన్వయంతో నెల్లూరు కార్పొరేషన్ సర్వాంగ సుందరంగా తయారవుతుంది… ఎక్కడ కూడా ఆలస్యం అనేది లేకుండా అభివృద్ధి పదంలో పట్టణం సాగుతుంది.
వారి దృష్టికి రాని కొన్ని అంశాలను వారి దృష్టికి తీసుకొచ్చేందుకు ఇక్కడికి వచ్చాం అని తెలిపారు.
Be the first to comment