
కొడంగల్ నియోజక వర్గం లగచర్ల గ్రామం, చలో ఈనెల 20న తరలిరండి బంజారా లంబాడి ప్రజల్లారా.
గిరిజనులపై అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి.
భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వికారాబాద్ జిల్లాలోని లగ్గాచర్ల లో ఫార్మా కంపెనీ ఘర్షణలో అమాయక గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసరించుకోవాలని రాష్ట్ర అధ్యక్షులు రవి చందర్ చౌహన్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ పెద్దలు తమ సానుభూతిపరులైన అగ్రవర్ణాల వారి లబ్దికోసం ఫార్మా కంపెనీ పేరుతో గిరిజనుల భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.లగాచర్ల, పూలి చెర్లకుంట తండాలు, రోటి బండ తండలకు చెందిన గిరిజనులు భయాందోళన తమ సొంత తండాలను, సొంత ప్రాంతాలను వదిలి దూర ప్రాంత బంధువుల ఇళ్లలో ఆశ్రమం పొందు తున్నారని తెలిపారు. దాడికి బాధ్యతను చేస్తూ 16 మంది గిరిజనులను జైలుకు పంపారని ఆయన అన్నారు. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి రిమాండ్ లో ఉన్న గిరిజను లను బెసరుతుగా విడిచిపెట్టి అక్రమ కేసులను ఉపసహరించుకోవాలని లేకుంటే గిరిజన సంఘాలు ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోర్ బంజారా ఉపాధ్యక్షులు రాందాస్ నాయక్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బాణోత్ దుర్గాప్రసాద్ నాయక్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రఘు చౌహాన్, తదితరులు పాల్గొన్నా
Be the first to comment