
వీరమహిళల క్రిస్మస్ వేడుకలు
జనసేన పార్టీ మాకిచ్చిన చిన్నమ్మ గజరాజు శాంతి కల ఎంఏ పి హెచ్ డి
ఈ క్రిస్మస్ పవిత్ర దినాల్లో పేదలకు బట్టలు పంచి కడుపునిండా అన్నం పెడితే పైనున్న మా ఆయన ఎంతో సంతోషిస్తాడు అని చెప్పుకొస్తున్న ఇటువంటి అభిమానం జనసేన పార్టీలోనే సొంతం…..
కిషోర్ గునుకుల జనసేన పార్టీ సిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నంతలో పదిమంది కి సహాయం చేస్తూ కబాడీ పాలెం లో తనదైన శైలి చూపించిన కీర్తిశేషులు వర కుమార్ గారు.
వైసిపి హయాంలో పోటీ అంటే ఆలోచించే రోజుల్లో 51వ డివిజన్ నుంచి జనసేన పార్టీ తరఫున వారి సతీమణి శాంతి కళ గారిచే పోటీ చేయించి తన ఖర్చు తోనే ప్రచారం చేసారు…
దురదృష్టవశాత్తు వారు మన మద్య లేకున్నా, వారి సేవలను కొనసాగిస్తున్నారు శాంతికళ గారు..
క్రిస్మస్ వేడుకలను పేదలతో పంచుకోవాలని అలా పంచుకుంటే ఆయన ఆత్మ శాంతిస్తుంది అని పంచుకున్న మనోగతానికి జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ… ఒక స్థాయి తరువాత తమకున్నది చాలు పేదలకు పంచి పెట్టాలని ఆలోచనలు అందరూ ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాం…
ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ 30వ డివిజన్ రామకోటి నగర్ నందు గిరిజన కాలనీలో పేదలకు బట్టలు పంచి భోజనం పెట్టడం జరిగింది.
తమతో పాల్గన్న సచివాలయం ఉద్యోగితో వారందరికీ రేషన్ కార్డులు ఆధార్ కార్డులో ఉన్నాయా లేదా పథకాలు వస్తున్నాయి లేదో కనుక్కొని..వారికి పట్టా ఇచ్చిన స్థలాల్లో ప్రభుత్వం పథకం కింద స్థలం ఉన్నవారికి ఇంటికి కట్టుకునే రుణాలు ఇప్పించే బాధ్యతను తీసుకోవాల్సిందిగా తెలుపగా, ఇప్పటికీ అప్లై చేస్తున్నామని ఈ 30 కుటుంబాలకి పెద్దలకు తెలియచేసి వీలైనంత త్వరగా ఈ ప్రాంతాలకు రోడ్లు మియూ సౌకర్యాలు వచ్చేటట్లు చేయవలసిందిగా ఉద్యోగి వివరించారు.
మున్సిపల్ శాఖా మాత్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు,నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకువచ్చి నెల్లూరు కార్పొరేషన్ లిమిట్ కి అతి చెరువులో ఉన్నాయి ప్రాంతానికి కావలసిన సదుపాయాలు అందే విధంగా చేస్తానని తెలిపారు..
Be the first to comment