వైసీపీ ప్రభుత్వంలో మాదిరిగానే కూటమి ప్రభుత్వంలో కూడా నిర్లక్ష్యానికి గురి అగుచున్న కాపులు

 

వైసీపీ ప్రభుత్వంలో మాదిరిగానే కూటమి ప్రభుత్వంలో కూడా నిర్లక్ష్యానికి గురి అగుచున్న కాపులు

గత వైసీపీ ప్రభుత్వం కాపులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఒకరకంగా చెప్పాలంటే కాపులను వర్గ శత్రువులుగా భావించింది. ఈ నేపథ్యంలో కాపులంతా వైసీపీ ప్రభుత్వ తీరును నిశితంగా గమనించి వైసీపీ ఓటమికి ఎనలేని కృషి చేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం వారు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారి ప్రయోజనాలు కాపాడే విధంగా ఇంతవరకూ ప్రత్యేకంగా ఏవిధమైన చర్యలు తీసుకొని ఉండలేదు. కూటమి ప్రభుత్వం వారు అన్ని కులాల కార్పొరేషన్లకు కూడా నిధులు కేటాయించారు. అదేవిధంగా కాపు కార్పొరేషన్ కు కూడా నిధులు కేటాయించారు. అంతేగాని ప్రత్యేకంగా కాపులకి చేసింది ఏమి లేదు. క్షత్రియ సేవా సమితి వారి విజ్ఞప్తి మేరకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతా రామరాజు గారి పేరు పెడుతున్నట్లుగా కూటమి ప్రభుత్వం వారు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం వారు కూడా అల్లూరి సీతా రామరాజు గారి పేరు మీదుగా ఒక నూతన జిల్లాను ఏర్పాటు చేశారు. కానీ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ కన్నెగంటి హనుమంతు గారి విషయంలో నేటి వరకూ కూటమి ప్రభుత్వం వారు స్పందించలేదు. ఆనాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నేటిగౌరవ టీడీపీ ఎమ్ఎల్ఏ శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు పల్నాడు జిల్లాకు శ్రీ కన్నెగంటి హనుమంతు గారి పేరు పెట్టాలని డిమాండ్ చేసియున్నారు. కానీ ఆ డిమాండ్ పట్ల కూటమి ప్రభుత్వం వారు ఇంత వరకూ స్పందించలేదు. స్వాత్రంత్ర్య సమరయోధులు అయిన శ్రీ కన్నెగంటి హనుమంతు గారి పట్ల, కాపు కులం పట్ల పాలకులు కుల వివక్ష చూపిస్తున్నారు అనేదానికి ఇదొక బలమైన ఉదాహరణగా పేర్కొనవచ్చు.
మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా గారి పేరు పెట్టాలని వైసీపీ ప్రభుత్వ కాలంలో దాదాపు అన్ని కాపు సంఘాలు వారు కోరినప్పటికి కూడా వారు కాపుల డిమాండ్ ను పరిగణలోకి తీసుకోలేదు. అదేసందర్భంలో ఆనాటి మాజీ ఎమ్ఎల్ఏ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వర రావు గారు కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలని నిరాహార దీక్ష కూడా చేసారు, పోరాటం చేసారు. నేడు వారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి గౌరవ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఇంతవరకూ ఆ డిమాండ్ పై కూటమి ప్రభుత్వం పక్షాన కనీస స్పందన లేదు.
కూటమి ప్రభుత్వం వారు ఆర్య వైశ్యులు విజ్ఞప్తి మేరకు శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా అధికారికంగా నిర్వహించే విధంగా ఉత్తర్వులు ఇచ్చారు. కానీ జనరంజకమైన పాలన అందించిన గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల వారి జయంతిని, వర్ధంతిని ప్రభుత్వ పక్షాన అధికారికంగా నిర్వహించాలని కాపు, బలిజ సంఘాలు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పాలకపక్షాల నుండి స్పందన లేదు.
ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం వారు వాల్మీకి మహర్షి జయంతిని అధికారికంగా ప్రభుత్వ పక్షాన నిర్వహించే విధంగా ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. వాల్మీకి, బోయ సోదరుల ఆకాంక్ష నెరవేర్చియున్నారు. కానీ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల పట్ల పాలక పక్షాలు అయిన కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీలు ఇప్పటికీ కూడా కుల వివక్షను కొనసాగిస్తున్నారు అనడానికి ఇంతకంటే బలమైన ఉదాహరణలు అవసరం లేదని కాపు ఐక్య వేదిక పక్షాన మేము బలంగా అభిప్రాయ పడుతున్నాం.

సామాజిక ఉద్యమాభివందనలతో..
*కాపు ఐక్య వేదిక*

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*