
కళాశాలల వద్ద మద్యంషాపులను ఎత్తివేయాలి — ఎఐఎస్ఎఫ్
కళ్యాణదుర్గం పట్టణంలో రెవెన్యూ కాలనీలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజ్, కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన రహదారిలో నూతనంగా మద్యం షాపు ( బెల్టు షాపు) ను నిర్వహించడాన్ని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఎఐఎస్ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది ..అందులో భాగంగా వందలాదిమంది విద్యార్థులతో కలసి ర్యాలీ చేపట్టి షాపు ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.. స్పందిచి షాపును తీసివేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు..కార్యక్రమంలో ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయుడు,జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయిస్వామి నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Be the first to comment