30, డిసెంబర్, 2024  పంచాంగం

30, డిసెంబర్, 2024  పంచాంగం

సూర్యోదయాస్తమయాలు:
ఉ 06.35 / సా 05.45
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : ధనుస్సు

స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయణం
హేమంత ఋతౌః / మార్గశిర మాసం / కృష్ణపక్షం

తిథి : అమావాస్య రా 03.56 ఉపరి పుష్యమాసారంభః
వారం  : సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం : మూల రా 11.57 వరకు ఉపరి పూర్వాషాడ

యోగం  : వృద్ధి రా 08.32 వరకు ఉపరి ధృవ
కరణం : చతుష్పాద సా 04.02 నాగ రా 03.56 ఆపై కింస్తుఘ్న

సాధారణ శుభ సమయాలు
-ఈరోజు లేవు-
అమృత కాలం  : సా 05.24 – 07.02
అభిజిత్ కాలం  : ప 11.48 – 12.32

వర్జ్యం : ఉ 07.34 – 09.12 & రా 10.19 – 11.57
దుర్ముహూర్తం : మ 12.32 – 01.17 & 02.46 – 03.31
రాహు కాలం : ఉ 07.59 – 09.23
గుళికకాళం : మ 01.34 – 02.58
యమగండం : ఉ 10.46 – 12.10
ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు

వైదిక విషయాలు
ప్రాతః కాలం    :  ఉ 06.35 – 08.49
సంగవ కాలం    :      08.49 – 11.03
మధ్యాహ్న కాలం  :    11.03 – 01.17
అపరాహ్న కాలం : మ 01.17 – 03.31

ఆబ్ధికం తిధి  : మార్గశిర అమావాస్య
సాయంకాలం  :  సా 03.31 – 05.44
ప్రదోష కాలం     :  సా 05.44 – 08.19
రాత్రి కాలం : రా 08.19 – 11.44
నిశీధి కాలం       :  రా 11.44 – 12.37

30-12-2024-సోమవారం రాశి ఫలితాలు

మేషం
బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమై నూతన రుణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వృషభం
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు రావలసిన పదోన్నతుల పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

మిధునం
ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులసలహాలు కలసివస్తాయి. వ్యాపారాలు అనుకులిస్తాయి.

కర్కాటకం
స్థిరస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపార విషయంలో జాగ్రత్త అవసరం.

సింహం
వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. సోదరులు కొన్ని విషయాలలో మీతో విబేదిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి.

కన్య
స్థిరస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. నూతన కార్యకమాలు చేపడతారు. దూరపు బంధువుల కలయిక ఉత్సాహనిస్తుంది. వృత్తి వ్యాపారములలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆకస్మిక వస్తు వాహన లాభాలు పొందుతారు. బంధు వర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

తుల
కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు తీరతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

వృశ్చికం
మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

ధనస్సు
కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. గృహమున కొందరి ప్రవర్తన శిరో భాధలు కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

మకరం
ఆత్మీయుల నుంచి వివాదాలకు సంభందించి కీలక సమాచారం. సన్నిహితుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చిన్న నాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.

కుంభం
వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. కొత్త రుణాలు చేస్తారు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆప్తులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

మీనం
ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో రావలసిన ప్రమోషన్లు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*