
రామ్‌గోపాల్ వర్మకు షాక్..
15 రోజుల్లోపు వడ్డీతో సహా కట్టాలంటూ లీగల్ నోటీసులు
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ షాక్ ఇచ్చింది.
వ్యూహం సినిమాకు లీగల్ నోటీసులు జారీ చేసింది.
ఆర్జీవీతో పాటుగా మొత్తం ఐదుగురికి ఏపీ ఫైబర్ నెట్ లీగల్ నోటీసులు పంపింది.
వ్యూహం సినిమాకు గానూ ఏపీ ఫైబర్ నెట్ గతంలో ఒప్పందం చేసుకుంది.
అయితే ఏపీ ఫైబర్ నెట్‌లో వ్యూహం సినిమాకు తగినన్ని వ్యూస్ లేకపోయినా ఫైబర్‌నెట్ నుంచి కోటీ 15 లక్షల రూపాయల మేర అనుచితంగా లబ్ధి పొందారంటూ లీగల్ నోటీస్ జారీ చేశారు.
దీనిపై వివరణ ఇవ్వాలని 15 రోజుల్లో వడ్డీతో సహా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ షాక్ ఇచ్చింది. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు లీగల్ నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్ నెట్.. వ్యూహం సినిమాకు రూ.2.15 కోట్లు ఒప్పందం చేసుకుని..1.15 కోట్లు చెల్లించారని ఫైబర్ నెట్ తెలిపింది. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా గతంలో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే వ్యూహం సినిమాకు కేవలం 1863 వ్యూస్ మాత్రమే ఉన్నాయన్న ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్.. ఈ లెక్కన ఒక్కో వ్యూకు రూ.11 వేలు చొప్పున చెల్లించారని పేర్కొంది. వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి కోటీ 15 లక్షల వరకూ అనుచిత లబ్ధి పొందారని.. దీనిపై వివరణ కోరుతూ వ్యూహం సినిమాకు లీగల్ నోటీస్ ఇచ్చినట్లు ఏపీ ఫైబర్ నెట్ ఓ ప్రకటనలో తెలిపింది.
మరోవైపు ఈ విషయమై ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ జీవీ రెడ్డి ఇటీవల విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఏపీ ఫైబర్‌నెట్ ద్వారా వ్యూహం సినిమా చూసినందుకు ఒక్కో వ్యూకు రూ.11 వేలు చెల్లించారన్న జీవీ రెడ్డి.. మొత్తం రూ.2.10 కోట్లు ఫైబర్‌నెట్ బ్యాంకు అకౌంట్ నుంచి ఆర్వీజీ ఆర్వీ సంస్థ బ్యాంకు ఖాతాలోకి వెళ్లాయని ఆరోపించారు. ఏపీ ఫైబర్‌నెట్ ఛానల్‌లో వ్యూహం సినిమాను కేవలం 1,863 మంది మాత్రమే చూశారని.. ఒప్పందం ప్రకారం ఒక్కో వ్యూకు రూ.100ల చొప్పున చెల్లించాల్సి ఉందన్నారు. కానీ ఏకంగా 11 వేల చొప్పున చెల్లించినట్లు తెలిపారు. ఆర్జీవీ ఆర్వీ సంస్థకు రూ.2 లక్షలు రావాల్సి ఉంటే.. రూ.2 కోట్లకుపైగా చెల్లించారని ఆరోపించారు. ఏపీ ఫైబర్ నెట్‌లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. తాజాగా వ్యూహం సినిమాకు ఏపీ ఫైబర్ నెట్ నుంచి లీగల్ నోటీసులు పంపించారు.
Be the first to comment