
తిరుపతి జిల్లా..
వరదయ్యపాళ్యం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం లోకి దూసుకెళ్లిన కంటైనర్ లారీ.
పోలీస్ స్టేషన్ మలుపు వద్ద ఘటన. తృటిలో తప్పిన ప్రమాదంరక్త గాయాలతో బయట పడ్డ మహిళ.
వరదయ్యపాళ్యం:
మండల కేంద్రమైన వరదయ్యపాళ్యంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలోనికి కంటైనర్ లారీ శుక్రవారం అర్ధరాత్రి దూసుకెళ్లింది.
ఈ ఘటన వరదయ్యపాళ్యం పోలీస్ స్టేషన్ మలుపు వద్ద జరిగింది.
అప్పుడే ఆలయం వెలుపల ముగ్గులు వేసి సామగ్రిని ఆలయం లోపల బధ్రపరిచేందుకు వెళ్ళగా ఇంతలో కంటైనర్ లారీ ఒక్కసారిగా ఆలయం లోనికి దూసుకు రావడంతో మహిళ గీత తీవ్ర గాయాలతో బయటపడింది.
కంటైనర్ లారీ నడుపుతున్న డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న కారణంగా ఈ ప్రమాధం జరిగినట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు.
పక్కనే వున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపు వాహన డ్రైవర్ పరారయ్యారు.
గాయాలపాలైన మహిళను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.
Be the first to comment