
విశాఖపట్నం వాల్తేరు డివిజన్‌ను విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే దక్షిణ కోస్తా జోన్‌లో కొనసాగించే విషయమై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడితో కలిసి ఢిల్లీలో బుధవారం రైల్వే మంత్రిని కలిసినట్టు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా విశాఖలో కొత్త రైల్వే జోన్‌తో పాటు వాల్తేరు డివిజన్‌ను కొనసాగించాలని కోరగా తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చారన్నారు. అలాగే కొత్త రైళ్లు, రైల్వే కనెక్టివిటీపై కూడా పలు ప్రతిపాదనలు సమర్పించామన్నారు. ఐటీ రంగంలో ఏపీకి భారీ పెట్టుబడులు ఆకర్షించడానికి అనువైన డీప్ టెక్ విధానాలపై మంత్రితో సీఎం చంద్రబాబు చర్చించారన్నారు. రాష్ట్రంలో ఐటీ, మౌలిక వసతులు, రవాణా రంగాల్లో అభివృద్ధికి ఈ చర్చలు దోహదపడతాయని ఎంపీ అభిప్రాయపడ్డారు.
Be the first to comment