
రొంపిచర్ల, తాళ్లపల్లిలో కేంద్రియ విద్యాలయాలకు పూర్తి స్థాయి ఆమోదం
-ఇక ప్రారంభానికి లైన్ క్లియర్
-ఫలించిన ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు కృషి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ దేశవ్యాప్తంగా 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించేందుకు ఆమోదం తెలపగా,, ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 8 కేంద్రియ విద్యాలయాలకు ఆమోదం లభించింది. ఇందులో పల్నాటి వాసులు ఎంతగానో ఎదురు చూస్తున్న రొంపిచర్ల, మాచర్ల మండలంలోని తాళ్లపల్లిలో కేంద్రియ విద్యాలయాలకు ఆమోదం లభించి, ప్రారంభానికి లైన్ క్లియర్ అయ్యింది. ఈ రెండు కేంద్రియ విద్యాలయాలు ఎప్పుడో మంజూరయ్యి, ప్రారంభానికి నోచుకోలేదు, నేడు కేంద్ర క్యాబినెట్ ఆమోదంతో ముందడుగులు పడ్డాయి. పల్నాడు లోని బిడ్డలకు ఉత్తమమైన విద్య అందించాలని.. గత ఐదేళ్లుగా శ్రీకృష్ణదేవరాయలు కృషి చేస్తూ ఏడు నియోజకవర్గాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఉండాలని అనిర్వచనీయమైన కృషి చేశారు. వీలు కుదిరినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తూ కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుపై అభ్యర్థించగా నేడు మంచి రోజులు వచ్చాయి. రొంపిచర్ల, తాళ్లపల్లిలో అత్యంత త్వరగా తరగతులు ప్రారంభమయ్యేందుకు చొరవ చూపుతామని, అలాగే మిగతా 3 నియోజకవర్గాల్లో కూడా ఈ స్కూల్స్ మంజూరయ్యేలా కృషి చేస్తానని తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Be the first to comment