ఆవేదనతో మాట్లాడుతున్న వంగవీటి మోహన రంగా అభిమాని

ఆవేదనతో మాట్లాడుతున్న వంగవీటి మోహన రంగ గారి వీరాభిమాని కాపు నాయకులు రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం యువత కార్యదర్శి గుండ్ర ఫణీంద్ర నాయుడు:
చీకటిలో చంపేశాం అని కొందరు అన్నారు.చంపించాం అని మరి కొందరు అన్నారు. చనిపోయాడు అని ఇంకొందరు ఆనందించారు కానీ.మా గుండెలో బతికే ఉన్నాడు అని కొన్ని లక్షల మంది ఇప్పటికి అంటున్నారు.అతను వ్యక్తి కాదు ఒక “మహాశక్తీ ”
పేదలు మెచ్చిన నాయకుడు
పెద్దలు తుంచిన రౌడీ.అన్యాయాన్ని ఎదిరించిన హీరో.ఆడ పడుచుల కు ఆప్యాయతగా పిలుచుకునే అన్నయ్య. అభాగ్యుల పాలిట ఆపన్న హస్తం.ఆంధ్ర అణగారిన జనాల బంధువు.అధికార పక్షాని కి శాసనసభ్యని గా ఉండి నిద్రలేకుండా చేసిన రాజకీయ ధురందరుడు.జైలు గోడల మధ్య ఉండి ప్రజల, అభిమానం తో గెలిచిన ఒకే ఒక్క రాజకీయ యోధుడు.
వంగవీటి మోహన రంగ* అన్న పేరు చెపితే ఇప్పటికి చాల మంది కి చెమటలు పడతాయి.అయన చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయినా ఇప్పటికి అయన విగ్రహాలు పెడుతున్నారు అంటే అందరు ఆలోచించుకోవాలి.
ఇప్పటికి అయన పేరు చెప్పుకుని ఓట్లు తెచ్చుకునే నాయకులూ చాల మంది ఉన్నారు.అందరు ఆప్యాయంగా పిలిచే “రంగన్న ” నిన్ను మేము చూడలేదు కానీ మీ గురించి చాల విన్నాము.పేదవాడు సహాయం అని పిలిస్తే నేనున్నా అని వెళ్ళేవాడివి అని చెప్పారు.
దళారీలపాలిట సింహస్వప్నమై అణగారిన జనాలకు ఆసరా గా నిలచావ్ అని చెప్పారు మా పెద్దలు,
తన జీవితం అంతా పేదలకోసం పోరాటాల కోసం
ఏం చెప్పినా ఎంత చెప్పినా తక్కువే రంగన్న
జోహర్ వంగవీటి మోహన రంగ గారు మీ *36వ వర్ధంతి* సందర్భంగా మీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తునాము.నా చిన్ననాటి నుంచి మా ఏరియాలో పెట్టాలని కోరిక ఇది నెరవేర్తునందుకు చాలా సంతోషంగా వుంది అంటూ గుండ్ర ఫణీంద్ర నాయుడు వంగవీటి మోహన రంగ గారిని తలుచుకుంటూ చాలా భాదతో మాట్లాడారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*