
అల్లు అర్జున్ ఇంటి పైన దాడి రేవంత్ రెడ్డి కుట్ర: సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వేల్పురి శ్రీనివాసరావు.
ప్రపంచ ప్రఖ్యాత గాంచిన సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటి మీద రేవంత్ రెడ్డి అనుచరులు దాడి చేయడం హేయమైన చర్య అని కాపు ఉద్యమ నేత వేల్పురి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సిఎం రేవంత్ రెడ్డి కులాల మద్య వివక్ష చూపడం సరికాదని, తెలుగు యూనివర్సిటీ కి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరంప్రతాపరెడ్డి పేరు పెట్టిన రేవంత్ రెడ్డి, 1969 తెలంగాణ ఉద్యమంలో 369 మంది తెలంగాణ కోసం పోరాడుతున్న ఉద్యమకారులు ను కాల్చి చంపిన అప్పటి సిఎం కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు తో ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ పేరు ను తొలగించ లేదు, కనీసం బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని కూడా తొలగించే ప్రయత్నం చేయలేదు అని శ్రీనివాసరావు తెలిపారు.
అదేవిధంగా తెలంగాణ లో లక్ష ఎకరాల భూమిని కబ్జా చేసి, అధికారం కోసం 400 వందల మంది అమాయక ప్రజలను హత్య కు కారకుడైన, హైదరాబాద్ ను పాకిస్తాన్ తో పోల్చిన వైయస్ రాజశేఖర రెడ్డి నాకు ఆదర్శం అని సిఎం రేవంత్ రెడ్డి చెప్పడం తెలంగాణ కు అవమానం కాదా అని రేవంత్ రెడ్డి ని శ్రీనివాసరావు ప్రశ్నించారు. తెలంగాణ కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేసిన చరిత్ర సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ కు ఉన్నది అని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
సంధ్య సినిమా హాలు వద్ద తొక్కిసలాట అల్లు అర్జున్ ప్రేరేపించినది కాదు, ఐనా మరణించిన రేవతి కుటుంబానికి తక్షణమే కోటి రూపాయల ఇవ్వాలని, శ్రీతేజ్ భవిష్యత్తు భాద్యత తీసుకోవాలని అల్లు అర్జున్ ను శ్రీనివాసరావు కోరారు. సిఎం కుల వివక్ష సరి కాదని, అందరినీ సమానంగా చూడాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
Be the first to comment