08, జూన్, 2025   పంచాంగం:  

08, జూన్, 2025   పంచాంగం:  

స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
గ్రీష్మ ఋతౌః / జ్యేష్ఠ మాసం / శుక్లపక్షం

*సూర్యోదయాస్తమయాలు:
ఉ05.34/సా06.39విజయవాడ
ఉ05.41/సా06.50హైదరాబాద్
సూర్యరాశి : వృషభం
చంద్రరాశి : తుల

తిథి  : ద్వాదశి ఉ 07.17 వరకు ఉపరి త్రయోదశి
వారం    : ఆదివారం (భానువాసరే)
నక్షత్రం   : స్వాతి మ 12.42 వరకు ఉపరి విశాఖ

యోగం : పరిఘ ప 12.18 వరకు ఉపరి శివ
కరణం   : బాలువ ఉ 07.17 కౌలువ రా 08.28 ఉపరి తైతుల

సాధారణ శుభ సమయాలు:
ఉ 06.30 – 09.30 మ 01.30 – 04.30
అమృత కాలం  : ఈరోజు లేదు
అభిజిత్ కాలం  : ప 11.40 – 12.33

వర్జ్యం          : సా 06.57 – 08.44
దుర్ముహూర్తం  : సా 04.54 – 05.47
రాహు కాలం    : సా 05.01 – 06.39
గుళికకాళం       : మ 03.23 – 05.01
యమగండం     : మ 12.07 – 01.45
ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు

వైదిక విషయాలు:
ప్రాతః కాలం          :  ఉ 05.34 – 08.11
సంగవ కాలం         :     08.11 – 10.48
మధ్యాహ్న కాలం    :     10.48 – 01.25
అపరాహ్న కాలం    : మ 01.25 – 04.02.

ఆబ్ధికం తిధి         : జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి
సాయంకాలం       :సా 04.02 – 06.39
ప్రదోష కాలం         :  సా 06.39 – 08.50
రాత్రి కాలం           :  రా 08.50 – 11.45
నిశీధి కాలం          :  రా 11.45 – 12.28
బ్రాహ్మీ ముహూర్తం :  తె 04.07 – 04.50.

08-06-2025-ఆదివారం రాశి ఫలితాలు:

మేషం
ఉద్యోగ విషయమై శుభవార్తలు అందుతాయి. గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని పనులు అనుకూలంగా మారుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగ అవకాశాలు పొందుతారు.

వృషభం
కుటుంబ విషయంలలో చిక్కులు కలుగుతాయి. ధనపరంగా ఇబ్బందులుంటాయి. ఖర్చులు అదుపు చేయడం మంచిది. పనులు నిదానంగా పూర్తవుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో నిరుత్సహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన విసుగు తెప్పిస్తుంది.

మిధునం
అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి, సమాజంలో ఆదరణ పెరుగుతుంది. వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు.

కర్కాటకం
కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. ప్రయాణాలు వాయిదా వేస్తారు వ్యాపారాలలో అకారణంగా వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులకు అధికారుల నుండి అనుకూలత ఉండదు. ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నాయి.

సింహం
చేపట్టిన పనులలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సమాజానికి ఉపయోగపడే పనులు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

కన్య
తండ్రి తరుపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. భూ సంబంధిత వివాదాలను పరిష్కారమవుతాయి. ఉద్యోగ విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.

తుల
ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు రెండు రకాలుగా మారుతాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమవుతుంది. స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.అనారోగ్య సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో అదనపు పని భారం వలన శ్రమ కలుగుతుంది.

వృశ్చికం
వ్యాపార పరంగా స్థిరమైన నిర్ణయాలు చేయలేరు. చేపట్టిన పనులలో ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. కావలసిన వారితో విభేదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

ధనస్సు
చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. విందు వినోద కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో హాజరు అవుతారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆలోచనలు కలసి వస్తాయి. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.

మకరం
దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు కలసి వస్తాయి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వాహన క్రయ విక్రయాలు లాభిస్తాయి.

కుంభం
రుణ భారం పెరిగి నూతన రుణాలు చేయవలశి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. నూతన పెట్టుబడులు కలిసిరావు. ఉద్యోగాలలో విమర్శలు పెరుగుతాయి.

మీనం
ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఋణ ప్రయత్నాలు కలిసిరావు. దూరపు బంధువుల నుండి ఒక వార్త విచారం కలిగిస్తుంది. దూర ప్రయాణ సూచనలు నిరుద్యోగులకు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలలో శ్రద్ద తీసుకోవడం మంచిది

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*