ఐపీఎస్ సంజయ్‌పై ఏసీబీ కేసు ?

ఐపీఎస్ సంజయ్‌పై ఏసీబీ కేసు ?

జగన్ రెడ్డి పాలనలో దారి తప్పిన ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఏసీబీ కేసుకు రంగం సిద్దమయింది. అయిన చేసిన అవినీతిని పూర్తి ఆధారాలతో విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో ఏసీబీ దర్యాప్తుకు జీఏడీ అనుమతి మంజూరు చేసింది. కేసు పెట్టి ఆయనను అరెస్టు చేస్తారా.. కేసు పెట్టి నోటీసులు ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఎస్సీ,ఎస్టీ కేసులపై అవగాహన పేరుతో సదస్సులు నిర్వహించకపోయినా నిర్వహించినట్లుగా బిల్లులు పెట్టుకుని డబ్బు చేసుకున్నారు. అలాగే కొన్ని గాడ్జెట్స్ కూడా కొనకుండాకొన్నట్లుగా బిల్లులు పెట్టి డబ్బులు కొట్టేశారు.

ఈ సంజయ్ తమ పరమైన పాటలు పాడుకుంటూ.. మత ప్రచారం చేసుకుంటూ హాయిగా ప్రజాధనం జీతంగా తీసుకుంటూ లూప్ లైన్ లో ఉండేవారు. కానీ జగన్ మనోడే అని అనుకుని తెచ్చి సీబీఐ చీఫ్ ను చేశారు. ఆయనను డమ్మీని చేసి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన పనులు చేశారు. మార్గదర్శి నుంచి చంద్రబాబు కేసుల వరకూ చేయని కుట్రలు లేవు. ఆ కుట్రల్లో ఈయన పని ప్రెస్ ముందుకు వచ్చి సజ్జల చెప్పింది మాట్లాడటం. ఆ కోణంలో ఆయన చేయని తప్పులు లేవు. డబ్బులు కూడా దండుకున్నారు.

  1. ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి.. డబ్బులు దోచుకుని జైలుకెళ్లడం కన్నా నీచమైన వ్యవహారం మరొకటి ఉండదు. కానీ సంజయ్ కు తప్పడం లేదు త్వరలో చంద్రబాబు , మార్గదర్శి కేసులలో ఆయన చేసిన ఘనకార్యాలన్నీ వెలుగులోకి వస్తాయి. అప్పుడు ఇలాంటివాడు అసలు ఐపీఎల్ ఎలా అయ్యాడు అందరూ అనుకునే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*