
గత నవంబర్ నెలలో 9 వ తేది నుంచి 14 వరకు థాయిలాండ్ లో నిర్వహించిన ” వరల్డ్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ” లో గోల్డ్ మెడల్ సాధించిన గుంటూరు జిల్లా ఏటుకూరు వాసి రవికుమార్ ను జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో ఏపీ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ (APMSIDC) చైర్మన్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ & మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు సత్కరించి అభినందనలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు గారు, గుంటూరు జిల్లా జాయింట్ సెక్రెటరీ సిరిగిరి శ్రీనివాసరావు గారు, గుంటూరు 31వ డివిజన్ అధ్యక్షులు మధులాల్ గారు, తాడేపల్లి మండల యువజన అధ్యక్షులు తిరుమలశెట్టి నరసింహారావు గారు తదితరులు పాల్గొన్నారు.
Be the first to comment