
బలిజలకు తగిన ప్రాధాన్యతనివ్వాలి – హరి ప్రసాద్
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు స్థానిక హోమిస్ పేట నందు గల బలిజ సంఘీయుల కార్యాలయం నందు రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి టిడిపి నేత బాలి శెట్టి హరిప్రసాద్ విచ్చేయగా ఆయనకు శాలువ పూలమాలలతో బలిజ సంఘం నాయకులు స్వాగతం పలికారు. అనంతరం హరిప్రసాద్ మాట్లాడుతూ, కడప పట్టణం నందు ఈనెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు మేడా మల్లికార్జున భవన్ నందు జరగనున్న బలిజ సంఘీయుల సమావేశానికి జిల్లా వ్యాప్తంగా బలిజ సంఘీయులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభను ఉద్దేశించి కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కడపకు విచ్చేయునున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ బలిజ భవనాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం జిల్లాలో రాజకీయపరంగా బలిజలకు ప్రాధాన్యత తగ్గిందని, గతంలో ఇదే టిడిపి ప్రభుత్వ హాయంలో జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా ప్రస్తుతం కేటాయించిన ఒక్క స్థానాన్ని కూడా బలిజ సంఘీయులు దగ్గరుండి ఓడించటం ఆయన తప్పుపట్టారు. బలిజ సంఘీయులందరూ సంఘటితంగా ముందుకు వెళ్లి ఈ.డబ్ల్యూ.ఎస్ (ఎకనమికల్లీ వీకర్ సెక్షన్) కుల ప్రాతిపదిక నెరవేర్చుకునే దిశగా ప్రభుత్వాన్ని కోరాలన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో బలిజలను ఈ.డబ్ల్యూ.ఎస్ కుల ప్రాతిపదికన గుర్తిస్తామని మాట ఇచ్చి మాట తప్పారని గుర్తుచేస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో బలిసిలను ఈ డబ్ల్యూ ఎస్ కుల ప్రాతిపదికన గుర్తించనున్నట్లు నారా లోకేష్ కుల పెద్దలకు సంఘీయులకు హామీ ఇచ్చారని అన్నారు. 22వ తేదీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగానే కాకుండా విషయం తెలుసుకున్న ప్రతి బలిజ సంఘీయుడు సభకు హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కడప ఎక్స్ కార్పొరేటర్ బండి బాబు, ప్రొద్దుటూరు బలిజ సంఘం గౌరవ అధ్యక్షులు ఎక్స్ కౌన్సిలర్ సింగంశెట్టి గుమ్మటమయ్య, బలిజ సంఘ సెక్రెటరీ ఎక్స్ కౌన్సిలర్ జయశంకర్, ఉపాధ్యక్షులు మాజీ టిడిపి పట్టణ అధ్యక్షులు ఘంటసాల వెంకటేశ్వర్లు, చంద్రమౌళి, రిటైర్డ్ ఎస్ఐ శంకర్, అల్లం చంద్రశేఖర్, బలిజ సంఘీయులు పాల్గొన్నారు.
Be the first to comment