పిఠాపురం ప్రభుత్వ హాస్పటల్ సందర్శన

*పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రి సందర్శించిన ఏపి మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు*

*అక్కడ అందుతున్న వైద్య సేవలు మరియు మందుల గురించి అడిగి తెలుసుకున్నారు*

*అలానే 100 పడకల ఆస్పత్రి సంబంధించిన ప్లాన్ ను ఆయన పరిశీలించారు*

*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ*

*మా జనసేన అధినేత మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు*

*పిఠాపురం ప్రజలకు 100 పడకల ఆస్పత్రి తీసుకువచ్చారు*

*పిఠాపురం 100 పడకల ఆస్పత్రి రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ ఆస్పత్రి గా తీర్చిదిద్దుతాం అని అన్నారు*

*ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించాలనేది మా లక్ష్యమని తెలిపారు*

*ఆహ్లాదకరమైన వాతావరణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేస్తామని అన్నారు*

*అధునాతన టెక్నాలజీతో మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో నూతన ఆసుపత్రి అందుబాటులో తీసుకువస్తామని తెలిపారు*

*త్వరలోనే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 100 పడకల ఆస్పత్రి కి శంకుస్థాపన చేస్తారు అని అన్నారు*

*ఈ 100 పడకల ఆస్పత్రి వల్ల 66 మందికి ఉద్యోగాలు వస్తాయి అని వారికి జీతాల రూపంలో 4.32 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అని తెలిపారు*

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*