కళాబ్రహ్మ కీర్తి. శే. శ్రీ ఎ. వి. రఘుబాబు

కళాబ్రహ్మ కీర్తి. శే. శ్రీ ఎ. వి. రఘుబాబు

అఖిల భారత బలిజ, కాపు కళాకారులు, క్రీడాకారులు :

.కళాబ్రహ్మ కీర్తి. శే. శ్రీ ఎ. వి. రఘుబాబు : కృష్ణా జిల్లా విజయవాడలో కాపు కుటుంబంలో ఎ. రాములు, రామాయమ్మ దంపతులకు జ్యేష్ట పుత్రునిగా జన్మించారు. S. S. L. C. వరకు చదివి అయ్యదేవర కాళేశ్వరరావు మార్కెట్ లో వ్యాపారం చేశారు. కళారంగం మీద ఆసక్తితో మిత్రులతో కలిసి హైదరాబాద్ సారధి స్టూడియో, మద్రాస్ లో డైరెక్టర్ దగ్గర రెండు సం. లు. అసిస్టెంట్ గా చేసి విజయవాడ చేరుకున్నారు. కీ. శే. నామాల కనకయ్య గారి సహకారంతో హార్మోనియం, ప్రముఖ తబలిస్ట్ వెంకన్న గారి వద్ద తబలా వాయించడం నేర్చుకున్నారు. శ్రీకృష్ణ లీలలు, శ్రీకృష్ణ తులాభారం నాటకాలలో నటించారు. “ప్రేమలీలలు ” సాంఘిక నాటకానికి దర్శకత్వం వహించి అందులో అయ్యర్ పాత్ర అద్భుతంగా నటించారు. 1950 సం. లో “విజయాంధ్ర నాట్యమండలి ” స్థాపించి తోటి కళాకారుల సహకారంతో రంగూన్ రౌడీ, పల్లె పడుచు, అన్నా చెల్లెలు, మాస్టర్జీ, ధనప్రపంచం, దేవదాసు, మాలపిల్ల, అహింసా విజయం, అల్లూరి సీతారామరాజు, నాటకాలను రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలలో ప్రదర్శించి కళోపాధ్యాయునిగా, దర్శకునిగా స్థిరపడ్డారు. కన్వశ్రీ గారు రచించిన బాలనాగమ్మ నాటకానికి (మాయల మరాటీ) అస్తిపంజరాలు, పుర్రెలతో, వికటాట్టహాసాలతో స్టేజ్ దద్దరిల్లి, ప్రేక్షకుల హర్షధ్వానాలతో మారు మొరోగేవి. రఘుబాబు రూపశిల్పిగా, టక్కు టమార, గజకర్ణ, గోకర్ణ, నల్లమారి, తెల్ల దెయ్యం వేషాలతో, భేతాళ నృత్యాలతో, అనేక పట్టణాలలో ప్రదర్శనలతో, అనేకమంది శిష్యులను తయారుచేసి కళాబ్రహ్మగా నిలిచారు. మట్టి ముద్దలతో మానవాకృతి, మేదరబద్దలతో ఆట గుఱ్ఱం తయారుచేసి ” జమిందారు ” నాటకానికి శోభను చేకూర్చారు. పల్నాటి యుద్ధం, బోసు చరిత్ర, గాంధీజీ శాంతిపధం, వీర బ్రహ్మేంద్రస్వామి కధలను బుర్రకధలుగా మలిచి సోదరుడు ఎ. ఎ. రమణను, కోడూరిపాటి రామును వంతలుగా తర్ఫీదుగా చేసుకుని ఎన్నో ప్రదర్శనలిచ్చి మేటి నటుడుగా, రూపశిల్పిగా, జానపద కళాబ్రహ్మగా జేజేలందుకున్న కళామూర్తి రఘుబాబు. 1955 సం. లో నటసార్వభౌమ కోడూరిపాటి వారి జమిందారు నాటకం చూసిన వీరు, వీరిబృందం కోడూరిపాటి వారు స్థాపించిన “ది రాయల్ ఆర్ట్ ధియేటర్స్ ” లో ” విజయాంధ్ర నాట్యమండలిని ” అనుసంధానం చేశారు. 1980 సం. విజయదశమి పర్వదినాన బెజవాడలో కనకదుర్గ అమ్మ వారి ఉత్సవాలు జరుగుతున్నాయి. తమ్ముడు ఊరిలోలేడు. తన ప్రాణ మిత్రుడు, శిష్యుడు అయిన నల్లా అప్పారావు తో తన అంతిమ కోరికగా కొంత ధనమిచ్చి కోడూరిపాటి వారితో కలిసి విజయవాడ పురవీధులలో కోలాట నృత్యములు నిర్వహించమని ఈ బాధ్యత నీవు తీసుకోమని కళామతల్లి వొడిలో శాశ్వత నిద్ర తీసుకున్నారు.

బుడగాల సుబ్బారావు, సేకరణ : భట్టరుశెట్టి వారి గ్రంధం నుండి.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*