
కాపు,తెలగ, బలిజ, వంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు కుటుంబ సభ్యులకు నమస్కారం
మనం డిసైడ్లు చేసే కుటుంబంలో పుట్టాం
సంపాదించటం అంటే కేవలం డబ్బునే కాదు మనుషుల్ని, విలువల్ని కూడా సంపాదించటం ,కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెకించే వారిని సంపాదించటం,ఆపదలో ఆదుకునే వారిని సంపాదించటం,బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని,మన కోపాల్ని అర్థం చేసుకునే వారిని సంపాదించటం.
ఇవన్నీ సంపాదించు కోలేని వాడు కష్టపడి కోట్లు కూడ బెట్టినా అవి కొన్నిసార్లు దేనికీ పనికిరావు.
కాపు అనే వారు ఎప్పటికీ కింగే ,మనకి కుల బలం ఉంది,మంచితనం ఉంది.ఐకమత్యం కూడా పెరిగితే మనల్ని ఎవరు ఆపేది లేదు
మనమంతా ఐక్యత తో ఉంటే తద్వారా అభివృద్ధి చెందుటకు, సంక్షేమ ఫలాలు పొందుటకు ఉపయోగపడుతుంది
ఈ విధమైన ప్రణాళికలు తో పనిచేసే కాపు సంక్షేమ భరోసా కేంద్రాలు కొన్ని ఏరియాలలో శాస్వత భవనాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా సంక్షేమంలో వెనుకబడి ఉన్న మనవాళ్లు అభివృద్ధి చెందుటకు సమీకరించి, బోధించి, వారికి సంక్షేమ ఫలాలు పొందుటకు కృషి చేయడం జరుగుతుంది
అందులో భాగంగా, రాజకీయాలకు అతీతంగా మనవారందరినీ వీలైనంత వరకు ఒకే గొడుగు కిందకు తెచ్చి ఐక్యత, అభివృద్ధి ,సంక్షేమంపై అవగాహన కల్పించుటకు తేది:08-12-2024 ఆదివారం నాడు విశాఖపట్నం జిల్లా,యారాడ బీచ్ ,శ్రీ శ్రీ శ్రీ దుర్గా దేవి అమ్మవారి ఆలయం వద్ద ఆత్మీయ కలయిక/పిక్నిక్ ఏర్పాటు చేయడమైనది
ఈ కార్యక్రమంలో సంఘం లో చేరుటకు సభ్యత్వం నమోదు,సభ్యుల పరిచయాలు, వివాహ సంబంధాలు కొరకు పరిచయాలు, వివిధ రంగాల్లో విజయం సాధించిన ప్రతిభావంతులకు ప్రోత్సాహక బహుమతులు, కాపు జాతి సంక్షేమానికి కృషి చేసే కాపు సంఘాల నాయకులకు, సన్మానాలు, ఆటలు ,పాటలు పోటీలు విజేతలకు బహుమతుల ప్రధానం మొదలైన కార్యక్రమాలు నిర్వహించబడును
ఈ కార్యక్రమానికి వచ్చేవారు(వచ్చేవారికి మెరుగైన సౌకర్యాల కల్పన కొరకు) తేది:05-12-2024 లోపల ప్రతి ఒక్కరూ ఎంట్రీ కూపన్లు తీసుకోవలయును.ప్రతీ ఒక్కరూ క్రమశిక్షణ పాటించి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుచున్నాము
ప్రయత్నం నాది, పలితం మనది, అందరికీ ఉపయోగపడుతుంది
చేతనైతే సహకరించండి లేదంటే సైలెంట్ గా ఉండండి
చేసేవారిని చెడ గొట్టకండి
వట్టి మాటలు కట్టి పెట్టండి గట్టి మేలు తలపెట్టండి
కాపు సంక్షేమమే ధ్యేయం -అభివ్రుద్దే లక్ష్యం
సమయాభావం తక్కువ ఉండడం వల్ల వ్యక్తిగతంగా వచ్చి అందరినీ ఆహ్వనించలేకపోవుచున్నాము
కావున ఈ మెసేజ్ ని వ్యక్తిగత ఆహ్వానం గా భావించి ప్రతీ కాపు కుటుంబ సభ్యులు విధిగా హాజరు కావాలని కోరుచున్నాము
ఈ మెసేజ్ ని ప్రతీ కాపు కుటుంబ సభ్యుని కి చేరే విధంగా ఫార్వర్డ్ చేయండి
మరిన్ని వివరాలకు సంప్రదించండి
కర్రి వెంకట రమణ & టీం
కాపు సంక్షేమ భరోసా కేంద్రాలు
సెల్:8500635995/
9848685395
Be the first to comment