
ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ కి ఘన నివాళులు.
వెంకటేశ్వరరావు కి ఆర్థిక సహాయం అందించిన ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట సభ్యులు గర్రె బాబురావు.
ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో తెలుగు సినీ వినీలాకాశానికి మకుటం లేని మహారాజు అశేష అభిమానుల కథానాయకుడు సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ,వర్ధంతి సందర్భంగా చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట మరియు కృష్ణ మహేష్ యువత హెల్పింగ్ పీపుల్స్ సొసైటీ ఈ శ్రీనివాసరెడ్డి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో రైలు ప్రమాదములో రెండు కాళ్లు పోగొట్టుకొని జీవనోపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి కృష్ణ మహేష్ యువత గ్రూప్ అడ్మిన్ & అధ్యక్షులు,ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట సభ్యులు గర్రె.బాబురావు చేతుల మీదగా ఆర్థిక సహాయం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ స్కూల్ టీచర్ సుబ్రహ్మణ్యం,తదితర అభిమానులు పాల్గొన్నారు.
Be the first to comment