
శ్రీకాకుళం పాతపట్నం సమస్యల పరిష్కారం కోసం నాదెండ్ల మనోహర్ ని కలిసిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను కోరారు. సచివాలయంలో మంత్రిని ఎమ్మెల్యే కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గంలోని ఆహార ధాన్యాలు నిల్వ కోసం హిరమండలం మండల కేంద్రంలో గిడ్డంగులు ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే అత్యధిక గిరిజన జనాభా కలిగిన నియోజకవర్గం కావడంతో నిరుపేదలైన గిరిజనులకు ఇతర కులాల వారికి తెల్ల రేషన్ కార్డు స్థానంలో అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు మంజూరు చేయాలని మంత్రి మనోహర్ ను ఎమ్మెల్యే గోవిందరావు కోరారు. తమ విన్నపాలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే చెప్పారు.
Be the first to comment