ప్రజాక్షేత్రంలో జర్నలిస్ట్ లుగా మేము అతిపెద్ద సెలబ్రిటీలం

ప్రజాక్షేత్రంలో జర్నలిస్ట్ లుగా మేము అతిపెద్ద సెలబ్రిటీలం

మేము విధి నిర్వహణలో ఉన్నప్పుడు మమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఎన్నో కళ్ళు నిత్యం గమనిస్తూనే ఉన్నాయి.సెలబ్రిటీలు అంటే అంతే గదా…మరీ…

జర్నలిస్ట్ లంటే చాలా మందికి వారికే తెలియని అభిమానం, గౌరవం అదే మా జర్నలిస్ట్ ల ను సెలబ్రిటీలు గా చేస్తుంది.

సమాజంలో జరుగుతున్న అవినీతి- అక్రమాలపై మా కదలికలు,మేము రాసే కధనాలు,తీరు-తెన్నులపై ప్రతిక్షణం మమ్మల్ని పరిశీలించే ప్రజలు ఎందరో ఉన్నారు. సెలబ్రిటీల పట్ల ప్రజల తీరు,పరిశీలన ఇలాగే ఉంటుంది మరీ…

అసలు మేము రోడ్డున కనబడ్డా0 అంటేనే… ఓ పెద్ద ఆకర్షణ.ప్రజల కళ్ళు పెద్దవిగా మారి జిగేలు మంటాయి. మేము ఎలా నడుస్తున్నాం.ఏమి చేస్తున్నాము.మా మాట తీరు,మా కదలికలు,మా వస్త్రధారణ,ప్రతీ కదలికను ప్రజలు చాలా సూక్ష్మంగా పరిశీలిస్తారు. ఎందుకంటే జర్నలిస్ట్ అంటే వారికే తెలియని ఓ…అభిమానం అది అంతే…ఇతర సెలబ్రిటీలను కూడా సేమ్ ఇలాగే చూస్తారుగా అందుకే…మా జర్నలిస్ట్ లు కూడా….పెద్ద సెలబ్రిటీలు

మేము రాసే కధనాలు, టీవీలలో ఇచ్చే స్పెషల్ స్టోరీలు నిత్యం ఫాలో అవుతూ…మా రాత లకు,పలుకులకు అభిమానులు మారి మమ్మల్ని సెలబ్రిటీలు గా చూస్తున్నారు.

సమాజంలో జరుగుతున్న అసమానతలను స్వయంగా ఎదిరించే దిశగా మేము ఉన్న ప్పుడు మాకు జోడీగా… గళం ఎత్తే ప్రజల అభిమానం ఓ జర్నలిస్ట్ గా మాకూ…ప్రజా సహకారం మా అభిమానుల నుండి లభిస్తుంది.ఈ సహ కారమే మా జర్నలిస్ట్ లను సెలబ్రిటీలుగా చేస్తుంది.

విలువలు కలిగిన జర్నలిస్ట్ లు మాత్రమే ప్రజాక్షేత్రంలో సెలబ్రిటీలు గా ఉన్నారు.

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో జనం ఎవరో ఒక సెలబ్రిటీల గూర్చి మాట్లాడుతారు. అలాగే విలువలు కలిగిన మా జర్నలిస్ట్ ల గురించి కూడా ఎక్కడో ఒక చోట ప్రజలు మా పై అభిమానాన్ని చాటుకుంటారు.ఈ విధానమే మా జర్నలిస్ట్ లను సెలబ్రిటీలు గా చూస్తుంది.

కొత్త ప్రాంతాల్లో న్యూస్ కవరేజీకి వెళితే…వెళ్లిన క్షణం నుండి మా పని పూర్తయి మమ్మల్ని అక్కడ నుండి సాగనంపే వరకు మా శరీరంలో సగభాగంగా మాకు పూర్తి సహకారం అందించే వ్యక్తుల అభిమానం వెలకట్టలేనిది.ఇది కాదా… జర్నలిస్ట్ అతిపెద్ద సెలబ్రిటీ అనడానికి సాక్ష్యం.

సమస్య ఏదైనా ముందుగా మా దృష్టికి తెచ్చి,ఇక మనకేం సమస్య లేదు అని మా జర్నలిస్ట్ లపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం మేము ఏ మాత్రం వమ్ము కానీయ్యం…ఎందుకంటే మీరు మా పై కలిగి ఉన్న అభిమానం,నమ్మకం సెలబ్రిటీలనే మించిన సెలబ్రిటీలుగా మీ మనస్సుల్లో మా జర్నలిస్ట్ లను అభిమానిస్తున్నారు కాబట్టి…

అంతేకాదు…మీ అభిమానం,నమ్మకం ఏనాడు పోగొట్టుకోము. ఒక జర్నలిస్ట్ గా ప్రతిక్షణం ప్రజా క్షేత్రంలో మీ కోసం జర్నలిజం విలువలతో నిత్యం మీకు అండగానే ఉంటాం

మా జర్నలిస్ట్ లను మీ మనస్సుల్లో అతిపెద్ద సెలబ్రిటీలు గా అభిమానిస్తున్న మీకు మేము ఒక విలువలు కలిగిన జర్నలిస్ట్ లుగా మార్గ దర్శకులం అవుతాం.ఏ విధానాలు, ఆలోచనలతో మీరు మా జర్నలిస్ట్ లను అభిమాని స్తూ మమ్మల్ని సెలబ్రిటీ లు గా చూస్తున్నారో మా పై మీకున్న అభిమానం, నమ్మకం ఎప్పటికీ నిలుపుకుంటాం.

నోట్:- జర్నలిస్ట్ మిత్రులారా…ఈ అంశం ప్రజాక్షేత్రంలో ప్రజలు-జర్నలిస్ట్ లకు ఉన్న సంబంధాలు పరిశీలించి రాయడం జరిగింది. జర్నలిస్ట్ లపై ప్రజలకు ఓ నమ్మకం,విశ్వాసం,అభిమానం ఇంకా మిగిలే ఉన్నాయి. అవి కాపాడు కొని మన అభిమానుల హృదయాల్లో మనం ఎప్పటికీ వారు అభిమానించే అతిపెద్ద సెలబ్రిటీలు గా ఉండాలి.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*