
మైసూర్ పాక్’ పేరెలా వచ్చిందో తెలుసా?
మైసూర్ను పాలించిన 24వ మహారాజు 4వ కృష్ణరాజ వడయార్ మంచి భోజన ప్రియుడు. కాకాసుర మడప్ప అనే ప్రధాన వంటగాడు రాజుకు కొత్త రకం రుచి చూపిద్దామని చక్కెర, శనగపిండి, నెయ్యి, యాలకులు కలిపి ఓ స్వీట్ చేశాడు. దాని రుచి రాజుకు నచ్చడంతో పేరేంటని అడిగారు. పంచదార పాకంలో శనగపిండి వేసి కలిపాడు కాబట్టి తన రాజ్యం పేరు వచ్చేలా ‘మైసూరు పాక’ అని చెప్పాడు. తర్వాతి కాలంలో అదే ‘మైసూర్ పాక్’గా మారింది.
Be the first to comment