కార్తీక మాస వనభోజన కార్యక్రమాల సందర్భముగా క్రింద పేర్కొన్న తీర్మానాలు చేద్దాము.

కాపు, తూర్పు కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల కార్తీక మాస వనభోజన కార్యక్రమాల సందర్భముగా క్రింద పేర్కొన్న తీర్మానాలు చేద్దాము.

1) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించిన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు
ఏర్పాటు చేయాలి.

2) ప్రతి జిల్లాలో 1000 దేశీయ గోవులతో కూడిన గోశాలలు నిర్మించాలి.

3)కృష్ణా జిల్లాకు V.M.R కృష్ణా జిల్లాగా మరియు పల్నాడు జిల్లాకు స్వాతంత్ర్య సమరయోధులు కన్నెగంటి హనుమంతు గారి పేరుగా నామకరణం చేయాలి.

4) ఆంధ్ర రాష్ట్రములో ఏర్పాటు చేసిన కాపు కార్పొరేషన్ కు ప్రతి సంవత్సరం 5 వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలి. ఈ నిధుల మంజూరు మరియు ఖర్చు లకు సంబంధించి చట్ట బద్దత కల్పించే బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలి.

5)నామినేటెడ్ పదవులలో కాపు, బలిజ వర్గీయులకు సంఖ్యా పరంగా రావలసిన పదవులు గురించి తీర్మానం.

6)మన ప్రాంతాలలో మన కుల సంఖ్యా బలం వుండి కూడా కాపు,బలిజ కళ్యాణ మండపాలు లేవో ఆయా ప్రాంతాలలో కళ్యాణ మండపం నిర్మాణాలు జరగాలి.

7) మన భారతీయ వివాహ విధానం కాని (ప్రీ వెడ్డింగ్ షూట్ )బహిష్కరిద్దాము.కాపు,బలిజ వివాహాల్లో జరిగే దుబారా ఖర్చులు తగ్గించుకొందాము.మన సంస్కృతిని కాపాడుకుందాం.

8)కాపు, బలిజ కులాలలో వున్న నిరుద్యోగ యువతకు కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ఏర్పాటు చేసి నిరుద్యోగాన్ని పారద్రోలే విధముగా అడుగులు వేద్దాం.

9) కాపు, బలిజల స్త్రీ శక్తిని ఆర్థికంగా ముందడుగు వేసేలా అడుగులు వేయాలి.

10)కాపు, బలిజల కుటుంబాలలో కొందరు ఇంటి పెద్దలు మద్యానికి బానిసలు అవుతున్నారు. వారు వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటమే కాక కుటుంబం మొత్తాన్ని అగాధములో నెట్టేస్తున్నారు. మధ్య బానిసలకు మధ్య విముక్తి కోసం కౌన్సిలింగ్ సెంటర్లు కౌన్సిలింగ్ కార్యక్రమాలు ఏర్పాట్ల గురించి నిర్ణయాలు తీసుకోవాలి

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*